Home » హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతడే..!

హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతడే..!

by Bunty
Ad

తమిళనాడు లోని నీలగిరి కనుమల్లో .. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో… రావత్ కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మయంలో.. 14 మంది ప్ర‌యాణికులు ఈ హెలికాప్ట‌ర్ లో ప్ర‌యాణించారు. అయితే.. పొగ మంచు.. వాతావ‌ర‌ణ ప్ర‌తి కూల‌త కార‌ణంగా.. హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలింది. దీంతో 13 మంది మ‌ర‌ణించారు.

Advertisement

Advertisement

అయితే ఈ సంఘటనలో… ఐ ఎఫ్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్‌ ఒక్కడే ప్రాణాలతో బయట పడ్డారు. ఆయ‌న తీవ్ర గాయాల‌తో మిల‌ట‌రీ ఆస్ప‌త్రి లో చికిత్స పొందుతున్నారు. మృత్యు వుతో పోరాడుతున్న వ‌రుణ్ సింగ్‌.. ఈ సంవ‌త్స‌ర‌మే.. శౌర్య చ‌క్ర అవార్డు అందుకున్నారు. గతేడాది ఎల్ ఏసీ తేజ‌స్ ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమ‌ర్జీన్సీ సేవ్ చేశారు. అయితే.. నిన్న జ‌రిగిన సంఘ‌ట లోనూ… వ‌రుణ్ సింగ్‌.. అదృష్ట వ‌శ్యాత్తు.. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డారు.

శుక్రవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలు త‌ర‌లి వెళ్ల‌నున్నాయి. శుక్రవారం ఢిల్లీలోని నివాసంలో ఉదయం గం.11 నుంచి మధ్యాహ్నం గం.2ల వరకు నివాళులర్పించేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వ‌నున్నారు అధికారులు.

 

Visitors Are Also Reading