Home » 90 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాడు..ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని ..!!

90 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాడు..ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని ..!!

by Sravanthi
Ad

ప్రేమకు కళ్ళు ఉండవు అనేది కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనేది ఏ వయసులో ఎలా పుడుతుంది ఎవరిపై పుడుతుంది అనేది చెప్పడం కష్టం.. అలాంటి ఓ ప్రేమ గురించి ఇప్పుడు చూద్దాం.. ఆ వ్యక్తికి 90 ఏళ్ల వయసు.. ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు మనవళ్లని మనవరాళ్లని ఎత్తుకుంటారు. లేదంటే కృష్ణా రామా అంటూ కాలం వెల్లదీస్తూ ఉంటారు. కానీ తమిళనాడులోని ఒక వృద్దుడు 90 ఏళ్ల వయసులో ఘాటు ప్రేమలో పడ్డాడు..

Advertisement

Also Read;ఆర్జీవీ పై నాగబాబు ఫైర్….చెత్త వెదవ నీచ్ కమీన్ కుత్తే అంటూ దారుణ‌మైన కామెంట్స్..!

Advertisement

65 ఏళ్ల మహిళపై ప్రేమను పెంచుకున్నాడు. ఏకంగా తనకున్న ఆస్తిని మొత్తం ఆమెకు రాసిచ్చాడు.. దీంతో వృద్ధుడి భార్య కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసింది.. పూర్తి వివరాలు చూద్దాం.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన పలనియప్పన్ (90) అనే వృద్ధుడికి భార్య పొన్నమల్ (82), కొడుకు కూతురు ఉన్నారు. అయితే ఇటీవలే డెబ్బై సంవత్సరాల కొడుకు మరణించాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు 65 ఏళ్ల ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.

తన భార్య కూతురు ఎంత చెప్పినా వినకుండా కోట్ల విలువచేసే 6.5 ఎకరాల భూమిని తన లవర్ పేరు మీద రాసేశాడు. ఇదేంటని భార్య కూతురు ప్రశ్నించేసరికి ఇల్లును కూడా మీకు ఇవ్వనంటూ బెదిరించాడు. దీంతో తన భార్య చేసేది ఏమీ లేక కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్ బాధితురాలికి తగిన న్యాయం చేయాలని పోలీసులకు సమాచారం అందించారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

 Also read;దర్శకుడు బాబి లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. మీరు అస్సలు నమ్మలేరు..?

Visitors Are Also Reading