Ad
హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ళ తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ అనేది ఈ నెల 25న ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. అయితే కరోనా కారణంగా గత మూడేళ్ళుగా ఐపీఎల్ మ్యాచ్ లు కూడా హైదరాబాద్ లో జరగకపోవడంతో.. ఈ మ్యాచ్ ను చూడాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ను సరిగ్గా నిర్వహించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దారుణంగా విఫలం అయ్యింది.
మొదట టికెట్ల అమ్మకం విషయంలోనే హెచ్సీఏ యొక్క అసాఫల్యత అనేది అందరికి కనిపించింది. ఆ తర్వాత మ్యాచ్ కోసం స్టేడియంను సిద్ధం చేయడంలో కూడా హెచ్సీఏ దారుణంగా విఫలం అయ్యింది. స్టేడియంలో 8 వేల కుర్చీలు అనేవి విరిగి ఉన్నాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ కూర్చుల భాధ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా వచ్చింది.
హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంకు వచ్చిన కెప్టెన్ రోహిత్ కు సరైన కుర్చీ అనేది వేయలేదు హెచ్సీఏ అధికారులు. ఆ తర్వాత మరొకటి తెచ్చిన కూడా అలాగే ఉండటంతో.. ఏంటిది అంటూ రోహిత్ సీరియస్ అయ్యినట్లు తెలుస్తుంది. దాంతో చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ కు ఎలాగూ సరైన కుర్చీలను వేయలేదు.. కనీసం ఆడటానికి వచ్చిన భారత కెప్టెన్ తో కూడా అలానే వ్యవహరిస్తారా అని హైదరాబాద్ ఫ్యాన్స్ హెచ్సీఏను ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
భారత జట్టులోకి ఉమ్రాన్ రీ ఎంట్రీ..?
సంజూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న బీసీసీఐ..!
Advertisement