సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కానీ,స్టార్ నిర్మాతలు కానీ,స్టార్ డైరెక్టర్లు కానీ ఓరేంజ్ మెయింటెన్ చేస్తారు. ముఖ్యంగా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఇష్టాయిష్టాలు ఉంటాయి. స్టార్ హీరో ఎన్టీఆర్ కు కార్లు అంటే చాలా ఇష్టం. అలాగే హీరో రామ్ చరణ్ కు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది క్రేజీ హీరోలు, దర్శకులు ఇండస్ట్రీలో ఎంతో హుందాతనాన్ని మెయింటెయిన్ చేస్తారు. అలాంటి వారిలో ఒకడే దర్శకుడు రాజమౌళి.
Advertisement
Advertisement
తెలుగు సినిమాలను ప్రపంచానికి పరిచయం చేసి హాలీవుడ్ రేంజ్ లో ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిర్మించే గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ఇతన్ని చిలిపిగా జక్కన్న అని పిలుస్తారు. మొదటిగా ఆయన సినీ ఇండస్ట్రీలో వీడియో ఎడిటర్ గా పని చేశారు. తర్వాత దర్శకుడు కావాలనుకున్నాడు. రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఆ సమయంలోనే రాజమౌళికి ఈటీవీ లో ఒక డైలీ సీరియల్ కి డైరెక్టర్ గా చేసే అవకాశం వచ్చింది.
అలా మొదటి సారిగా సీరియల్ డైరెక్టర్ గా చేశారు రాజమౌళి. ఆ సీరియల్ పేరు శాంతినివాసం. ఇలా తన సినిమా డైరెక్షన్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఇక అంచెలంచెలుగా ఎదిగి ఆయన తన జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలో ఆయన తన డ్రీమ్ కారును మొదటగా కొన్నారు. అది ఏంటంటే బీఎండబ్ల్యూ 7 సిరీస్ దీని ధర 1.50 లక్షలు ఉంటుంది. ఆయన తర్వాత కొన్న కారు టయోటా వెల్ఫేర్ 91 లక్షలు. ఈ విధంగా ఆయన కూడా మార్కెట్లోకి ఏ న్యూ మోడల్ కార్ వచ్చిన కొంటూ ఉంటారని తెలుస్తోంది.