జేమ్స్ కామెరాన్ 2009లో తెరకెక్కించిన అవతార్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ సినీ చరిత్రలోనే అవతార్ సినిమాకి మించిన కలెక్షన్లు 13 ఏళ్లలో మరే సినిమా వసూలు చేయలేకపోయిందనే గర్వంగా చెప్పవచ్చు. అవతార్ చిత్రం ఏకంగా 3 బిలియన్ డార్లకు పైగా వసూలు చేసి ప్రపంచ రికార్డును తిరగరాసింది. 13 ఏళ్ల తరువాత మళ్లీ అవతార్ 2 సీక్వెల్ డిసెంబర్ 16, 2022న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవతార్ రికార్డును తిరగరాస్తుందా లేక పలితం మరోవిధంగా ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. డిసెంబర్ 16న థియేటర్లలో విడుదలైన అవతార్ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కాకపోతే నిడివి విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
మరోవైపు ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే పైరసీ వచ్చేసింది. అయితే విజువల్ వండర్ గా పేరు తెచ్చుకున్నటువంటి అవతార్ 2 మూవీకి పైరసీ వల్ల పెద్దగా నష్టం కలుగదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అవతార్ 2 సినిమాలోని కొన్ని సీన్లకు భారతీయ పురాణాలకు లింక్ ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రామాయణంలో రాముడు లంకపై విజయం సాధించడం కోసం వానరుల సహాయం తీసుకున్న విషయం విధితమే. ఇక అవతార్ 2 సినిమా విషయానికొస్తే.. భూలోక వాసులపై విజయం సాధించడం కోసం జేక్ సల్లీ జలవాసుల సహాయం తీసుకున్నారు. పాండవులు విరాటరాజు కొలువులో దాక్కున్న విధంగా అవతార్ 2 సినిమాలో హీరో ఫ్యామిలీలో జలవాసుల వద్ద తల దాచుకోవడం గమనార్హం. హిరణ్యకశపుడు ప్రహ్లదుడు తరహా సన్నివేశం కూడా అవతార్ 2 సినిమాలో ఉండడం విశేషం.
Advertisement
Also Read : PSPK 10 రిమేక్ సినిమాలు. 9 హిట్లు,1 ఫట్! ఇదిగో ఆ లిస్ట్!!
జేమ్స్ కామెరాన్ భారతీయ పురాణాలపై అవగాహనను కలిగి ఉన్నాడని ఈ సినిమాలోని చాలా సన్నివేశాలకు భారతీయ పురాణాలు స్ఫూర్తి అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవతార్ 2 సినిమా కలెక్షన్లు సైతం అదే రేంజ్ లో వస్తున్నట్టు సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు దాదాపు రూ.20కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అవతార్ 2 సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలుస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వచ్చే వారం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు. అవతార్ 2 రూ.16వేల కోట్లతో తెరకెక్కగా.. రాబోయే రోజుల్లో ఏరేంజ్ లో రికార్డులను క్రియేట్ చేయనుందో వేచి చూడాలి మరి.
Also Read : హీరో గోపీచంద్ నాన్న డైరెక్ట్ చేసిన సినిమాలు.