Home » చెక్ బౌన్స్ అయిందా..ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే..?

చెక్ బౌన్స్ అయిందా..ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే..?

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో ప్రతీది ఆన్ లైన్ లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో చెక్కుల వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించే సమయంలో ఈ చెక్కులు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలోనే మనం చెక్ బౌన్స్ అయింది అంటూ చాలామంది మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అలా చెక్కు బౌన్స్ అయిన సమయంలో ఎలాంటి రూల్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ చెల్లింపుల్లో భాగంగానే ఇతరులకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే మాత్రం జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లే పరిస్థితి రావచ్చు. అనేకసార్లు ఇదే తప్పులను చేసినట్లయితే, బ్యాంకు మీ యొక్క చెక్ సౌకర్యాన్ని నిలుపుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇది ఒక్కోసారి ఆ వ్యక్తి యొక్క ఖాతాని కూడా మూసి వేయడానికి కారణం అవ్వచ్చు.

Advertisement

చెక్ బౌన్స్ కు కారణాలు:

Advertisement

చెక్ బౌన్స్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి మీ ఖాతాలో డబ్బు తక్కువగా ఉండటం. అంతేకాకుండా ఇతర బ్యాంకు ఖాతాలు చెక్కులపై సంతకాలు కూడా ఒక కారణంగా ఉండవచ్చు. ఇదే కాకుండా చెక్కుపై పొందుపరిచిన నంబర్ సరిగ్గా లేకున్నా చెక్ బౌన్స్ అవుతుంది. ఈ విధంగా చెక్కు పాడైనట్లయితే సదరు బ్యాంకు దాన్ని క్లియర్ చేయదని గుర్తుంచుకోండి. చెక్ బౌన్స్ అయిన సమయంలో బ్యాంకు ఆ ఖాతాదారుడిపై జరిమానా విధిస్తుందనే విషయం అందరికీ తెలుసు. మీ ఖాతాలో తక్కువ బ్యాలెన్స్ ఉన్న కారణంగా చెక్కు బౌన్స్ అయితే అది క్రిమినల్ కేటగిరి కిందకు వస్తుందట. ఒక్కోసారి జైలు శిక్ష కూడా పడవచ్చట. దీనికి సంబంధించి ముందుగానే లీగల్ నోటీసులు కూడా పంపుతారట.


జాగ్రత్తలు:

ముఖ్యంగా ఎవరికైనా చెక్కు ఇచ్చేటప్పుడు మీ ఖాతాలో డబ్బులు ఉన్నాయా లేవో చూసుకోవాలి..
మీరు బ్యాంకులో ఏ విధమైన సంతకాన్ని పెడుతున్నారో ఆ చెక్కుపై కూడా ఆ విధంగా పెడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి.
ముఖ్యంగా చెక్కుపై వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.

 

Visitors Are Also Reading