Home » హర్షల్ ఇంట్లో తీవ్ర విషాదం.. బబుల్ నుండి బయటకు..!

హర్షల్ ఇంట్లో తీవ్ర విషాదం.. బబుల్ నుండి బయటకు..!

by Azhar
Ad

ఐపీఎల్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంలో ముఖ్యపాత్ర పోషించాడు ఆ జట్టు యంగ్ పేసర్ హర్షల్ పటేల్. ఆ సీజన్ లో మొత్తం 15 మ్యాచ్ లు ఆడిన హర్షల్ 32 వికెట్లు తీసాడు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ కోసం జరిగిన మెగవేలంలో అతడిని 10.75 కోట్లు పెట్టి మళ్ళీ దక్కించుకుంది ఆర్సీబీ.

Advertisement

అయితే ప్రస్తుతం ఐపీఎల్ కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బాబుల్ లో ఉన్న హర్షల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని చెల్లెలు అర్చిత పటేల్ నిన్న రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న హర్షల్ పటేల్ సోదరి.. నిన్న పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నిన్న ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో హర్షల్ కు తన సోదరి మరణవార్త తెలిసింది.

Advertisement

దాంతో మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూర్ యాజమాన్యం నుండి అనుమతి తీసుకుకొని హర్షల్ పటేల్ బయో బాబుల్ నుండి బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది. తన సోదరి అంత్యక్రియల్లో పాల్గొని.. మళ్ళీ హర్షల్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. కానీ బయో బాబుల్ దాటినా ఏ ఆటగాడు అయిన సరే తిరిగి అందులోకి ప్రవేశించాలంటే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉండాలి. కాబట్టి ఏప్రిల్ 12న చెన్నైతో జరిగే మ్యాచ్ కు హర్షల్ దూరం కానున్నాడు.

Visitors Are Also Reading