ప్రతి ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతుంటాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి మిస్ యూనివర్స్ గా ప్రకటిస్తారు. ఈ ఏడాది ఇజ్రాయిల్ లోని ఇలాట్ వేదికగా 70వ విశ్వసుందరి పోటీలు జరిగాయి. ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 80 మంది అందగత్తెలు పాల్గొన్నారు. అందరిని వెనక్కినెట్టి భారత్‌కు చెందిన హర్నాద్ సంధు విశ్వసుందరిగా నిలిచారు. మిస్ సౌతాఫ్రికా, మిస్ పరాగ్వే, మిస్ ఇండియాలు ఫైనల్స్ కు చేరుకున్నారు.
ఫైనల్స్‌కు చేరుకున్న వారిని నిర్వాహకులు ఓ ప్రశ్న అడిగారు. మీ షోను చూస్తున్న మహిళలకు మీరిచ్చే సలహా ఏంటని అడిగారు. ఈ ప్రశ్నకు మిస్ ఇండియా హర్నాద్ సంధు చాలా తెలివైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.. తమను తాము నమ్మకపోవడం. మీకు మీరే ప్రత్యేకం అని నమ్మినపుడు అదే మిమ్మల్ని అందంగా మారుస్తుంది. ఇతరులుతో పోల్చుకోవడం ఆపేసి.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడండి. భయాలను పక్కనపెట్టి బయటకు రండి.. మీ జీవితాలకు మీరే లీడర్… మీ గురించి మీరే మాట్లాడండి.. మీకు మీరే గొంతుక. నన్ను నేను నమ్మాను.. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నిల్చోగలిగాను అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం ప్రతి ఒక్కరిని ఇన్పైర్ చేసేవిధంగా ఉండటంతో హర్నాధ్ సంధుని మిస్ యూనివర్స్ గా ప్రకటించారు.
Advertisement