Home » మిస్టర్ బచ్చన్ సినిమాపై జోకులు వేసిన రానా… హరీష్ శంకర్ సీరియస్..!

మిస్టర్ బచ్చన్ సినిమాపై జోకులు వేసిన రానా… హరీష్ శంకర్ సీరియస్..!

by Sravanthi

రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. ఈ మూవీతో భాగ్యశ్రీ అనే కొత్త హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు దర్శకుడు హరిశంకర్. ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కలెక్షన్స్ విషయంలో మాత్రం డిజాస్టర్ గా నిలిచిపోయింది. డివైడెడ్ టాక్ మొదట్లో వచ్చింది. కానీ హరీష్ శంకర్ మీద ఉన్న నెగెటివిటీ వలన మరి ఏంటో తెలియదు కానీ సినిమా డిజాస్టర్ రిపోర్టులని సొంతం చేసుకుంది.

Harish Shanker

Harish Shanker

విడుదలైనప్పటి నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు కూడా సినిమాను చూడడానికి థియేటర్ కి రాలేదు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ కార్యక్రమంలో రానా, తేజ సజ్జా కలిసి జోకులు వేయడం జరిగింది. రానాతో పాటుగా తేజ హోస్ట్ గా వ్యవహరించారు. సరదాగా మాట్లాడారు. చాలా మూవీస్ మీద కామెంట్లు చేశారు.

Also read:

అందులో మిస్టర్ బచ్చన్ సినిమా గురించి రానా మాట్లాడారు. హై చూశారు లోయస్ట్ చూశారు అని.. హైయెస్ట్ అయితే కల్కి లోయస్ట్ ఏంటి అని అడిగితే అది మిస్టర్ అని అంటుండగా తేజ అలా మాట్లాడొద్దని ఆపేసాడు. అయితే ఇక్కడ వాళ్ళు సినిమా పేరు ప్రస్తావించకపోయినా మిస్టర్ బచ్చన్ అని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వీడియో క్లిప్ ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. జోకులు వేస్తున్నారు అన్న రవితేజ అన్నా అంటూ ఆయనని ట్యాగ్ చేశారు. అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ఎవరికైనా అని హరీష్ శంకర్ సమాధానం చెప్పారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading