పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టార్ పెసర్లు జట్టు నుంచి తప్పుకున్నారు. గాయం కారణంగా మొత్తం ఆసియాకప్ నుంచి నిష్క్రమించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పాక్ జట్టు బలహీనపడే అవకాశం ఉంది. మరి ఆ స్టార్ బౌలర్లు ఎవరు అని తెలుసుకునే ముందు టీమిండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ గురించి చూద్దాం…ఆసియాకప్ సూపర్ ఫోర్ దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 228 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్ శివాలెత్తిచారు.
మొదటిరోజు రోహిత్ శర్మ, గిల్ జోడి అదరగొడితే….డే 2లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆడారు. డే-1లో రోహిత్, గిల్ చెరో హాఫ్ సెంచరీ బాధగా… డే2లో కోహ్లీ, రాహుల్ సూపర్ సెంచరీతో పాక్ పతనాన్ని శాసించారు. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లు తేలిపోయారు. టపార్డర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరారు. మిడిలార్డర్ ఆదుకుందా అంటే అదీ లేదు. ఈ క్రమంలో 32 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫకర్ జమాన్ 27, అగర్ సల్మాన్ 23 రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
Advertisement
Advertisement
బూమ్రా, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. టీమిండియా నుంచి ఓడిన బాధ నుంచి కోలుకోక ముందే పాక్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ పెస్ బౌలర్లు హారిస్ రవూఫ్, నశింసాలు ఆసియాకప్ కు దూరమయ్యారు. వీరి స్థానంలో యువ పైసర్లు జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చారు. తర్వాత మ్యాచ్ లో వీరిద్దరూ పాక్ జట్టుతో కలవనున్నారు. పాక్ క్రికెట్ బోర్డు ఏమంది అంటే రవుఫ్, నశింసా ఇద్దరూ మెడికల్ ప్యానల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది. వారికి ఆయిన గాయాలు అంత తీవ్రమైనవి కావని ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని వారికి రెస్ట్ కల్పించామని చెప్పింది. ఆసియాకప్ లో వారిని ఆడించే రిస్క్ తీసుకోలేమని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
- Lavanya Tripathi : పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం !
- బేబీ మూవీలో పెళ్లికొడుకు.. యాంకర్ విష్ణుప్రియకు ఉన్న సంబంధం ఇదే ?
-
అలాంటి పాత్రలకే పరిమితమైన హనీ రోజ్…!