తెలుగుతేజం నందమూరి తారకరామారావు నటవారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ, హరికృష్ణలు ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ బాలనటుడిగా పరిచయమై ఆ తరవాత వరుస సినిమాలు చేస్తూ తండ్ర వారసత్వాన్ని టాలీవుడ్ లో కొనసాగించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. అయితే హరికృష్ణ లేటు వయసులో హీరోగా ఎంట్రీగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
హరికృష్ణ చేసింది తక్కువ సినిమాలే అయినా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాడు. అంతే కాకుండా కుర్రహీరోలకు సైతం హరికృష్ణ పోటీ ఇచ్చాడు. ఓ యేడాది అయితే హరికృష్ణ దెబ్బకు కుర్రహీరోలు సైతం తట్టుకోలేకపోయారు. హరికృష్ణ కుర్రహీరోలతో పోటీకి దిగి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాడు.
Advertisement
ఆ సినిమా ఏది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…2003 సంవత్సరంలో విడుదలైన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అదే ఏడాది చివరిలో డిసెంబర్ లో పలు హీరోల మధ్య పోటీ నెలకొంది. డిసెంబర్ లో తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు సినిమా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆ తరవాత అల్లరి నరేష్ హీరోగా నటించిన మా అల్లుడు వెరీగుడ్ సినిమా కూడా విడుదలైంది.
ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత వారం గ్యాప్ లో నీకే మనసిచ్చాను సినిమా విడుదలైంది. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక అదే వారంలో హరికృష్ణ నటించిన టైగర్ హరిచంద్రప్రసాద్ సినిమా డిసెంబర్ 18న విడుదలైంది. రమ్యకృష్ణ, సంగీత సినిమాలో హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు సముద్ర దర్శకత్వం వహించగా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులకు తెగనచ్చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు తెగనచ్చడంతో పాటూ భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలతో పాటూ సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీగా వసూళ్లు రాబట్టింది.