నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కు జోడీగా కేథరిన్ హీరోయిన్ గా నటించింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బింబిసార బ్లాక్ బస్టర్ అవ్వడంతో కల్యాణ్ రామ్ సినిమా లైఫ్ తో పాటూ ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి కూడా అభిమానులు తెగ వెతుకున్నారు.
Advertisement
కాబట్టి కల్యాణ్ రామ్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఆయన సతీమణి పేరు స్వాతి. 2006 వ సంవత్సరంలో ఆగస్టులో వీరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు కల్యాణ్ రామ్ పెళ్లికి ముందు రెబల్ లా ఉండేవారట. కానీ పెళ్లి తరవాత చాలా మారిపోయాడట. కల్యాణ్ రామ్ తల్లి ఓ బంధువుల ఫంక్షన్ లో స్వాతిని చూశారట. ఆ విషయాన్ని హరికృష్ణ కు చెప్పగా ఆయన ఆరా తీయడం మొదలు పెట్టారట.
Advertisement
స్వాతి తండ్రి దూరపు బంధువు అని తెలియడంతో పాటూ ఆయన కూడా ప్రముఖ వ్యాపారవేత్త అని తెలిసింది. హరికృష్ణ స్వాతి తండ్రికి నేరుగా ఫోన్ చేసి పెళ్లిగురించి మాట్లాడారట. స్వాతి తండ్రికి కూడా నందమూరి ఫ్యామిలీతో సంబంధం అనేసరికి సంతోషపడ్డారు. అంతే కాకుండా హరికృష్ణకు తన సంతానంలో ఒక్కరినైనా డాక్టర్ చదివించాలని ఉండేదట. కానీ ఎవరూ మెడిసిన్ చదవలేదు.
స్వాతి డాక్టర్ అని తెలియడంతో హరికృష్ణ సంతోషపడ్డారు. కానీ పెళ్లి తరవాత కల్యాణ్ రామ్ స్వాతిని ఉన్నత చదువులు చదువుంటావా అని అడగ్గా తనకు మెడిసిన్ పై ఆసక్తిలేదని వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపిస్తానని చెప్పడంతో కల్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పారు. ఈ విషయంలోనే కల్యాణ్ రామ్ పై హరికృష్ణ గుర్రుగా ఉండేవారట. కోడలిని అయినా డాక్టర్ వృత్తిలో చూడాలనుకుంటే స్వాతి కూడా సినిమాల్లోకి వచ్చిందని హరికృష్ణ కొంతకాలం పాటూ కల్యాణ్ పై కోపంతో ఉండేవారు.