Ad
భారత జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఇప్పుడు హార్దిక్ పాండ్య కొనసాగుతున్నాడు. అయితే ఏ జట్టు విజయంలోనైనా అలా రౌండర్ కు చాలా ముఖ్యపాత్ర ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు సమంగా చేసినప్పుడే వారు అసలైన ఆల్ రౌండర్ అవుతాడు.అ యితే పాండ్య కూడా మన భారత జట్టులోకి వచ్చిన మొదట్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు బాగా చేసేవాడు. కానీ 2019 ప్రపంచ కప్ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత పాండ్య బౌలింగ్ పోయింది.
సరైన ఫిట్నెస్ అనేది లేకపోవడంతో పాండ్య బౌలింగ్ అనేది చేయలేకపోయాడు. గత టీ20 ప్రపంచ కప్ లో కూడా పాండ్యను తీసుకోవడం ఈ విషయంలో వివాదాస్పదమైంది. కానీ ఇప్పుడు పాండ్య మళ్ళీ పూర్తి ఫిట్ గా మారాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో బౌలింగ్ లో కూడా రాణించిన పాండ్య భారత జట్టుకు ఎంపికై మళ్ళీ తాను పాత పాండ్యల మారాను అంటూ నిరూపించాడు.
అయితే ఇదే విషయంపై తాజాగా పాండ్య మాట్లాడుతూ.. నేను ఫిట్నెస్ సాధించిన తర్వాత ఇప్పుడు బౌలింగ్ లో పూర్తి కోట వేయగలను. అయితే నా బౌలింగ్ విలువ అనేది నేను తెలుసుకున్నాను. నా బౌలింగ్ వల్ల జట్టులో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. గతంలో ఎవరైనా బౌలింగ్ చేయపోతేనే నేను బౌలింగ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను నా కోటా అనేది పూర్తిగా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే బ్యాటింగ్ కూడా బాగానే చేస్తున్నాను అని నమ్ముతున్నా అంటూ పాండ్య తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
గాయంపై రోహిత్ క్లారిటీ..!
ఇక మౌకా మౌకా యాడ్ కనిపించదట..!
Advertisement