Home » రోహిత్ శర్మ ముంబై జట్టును వీడితేనే మంచిది – పాండ్యా

రోహిత్ శర్మ ముంబై జట్టును వీడితేనే మంచిది – పాండ్యా

by Bunty
Published: Last Updated on
Ad

గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిపి తన కెప్టెన్సీ కెపాసిటిని నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్యా. తొలి సీజన్లో టైటిల్ గెలుచుకోగా గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. దీంతో హార్దిక్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో సంప్రదింపులు జరిపింది. ఎట్టకేలకు క్యాష్ అండ్ ట్రేడ్ విధానంతో ముంబై గూటికి చేరిన హార్దిక్ పాండ్యాకు జట్టు యాజమాన్యం కెప్టెన్ ను చేసేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో కానీ ముంబైకి ఉన్న క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైని అన్ ఫాలో చేశారు. రోహిత్ ని తప్పించగానే మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే…. డివిలియర్స్, సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ ను తప్పించి పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించడం కరెక్ట్ అంటున్నారు.

Advertisement

అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ ముంబై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ కు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా అలా ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ముంబై నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో ముంబై కావాలనే తప్పించినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా, కెప్టెన్ బాధ్యతలు తొలగించడంపై రోహిత్ ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకపోవడంతో యాజమాన్యానికి, రోహిత్ కు మధ్య దూరం పెరిగిపోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో త్వరలో రోహిత్ ముంబైకి గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా సంచలన కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మ ముంబై జట్టును వీడితేనే ఆరో టైటిల్ సాధిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ముంబై నుంచి బయటకు పోవాలని నేను అనుకుంటున్నాను. అతడు జట్టు నుంచి బయటకు పోతేనే మేము ఐపీఎల్ ఆరవ ట్రోఫీని సాధిస్తామంటూ సంచలన వాక్యాలు చేశాడు పాండ్యా. అతను చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ముంబైపై పీకల్లోతూ కోపంలో ఉన్న ఫ్యాన్స్ కు పాండ్యా స్టేట్మెంట్ పుండు మీద కారం చల్లినట్టుగా అయింది. మొత్తం మీదుగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య కెప్టెన్సీ వివాదం చినిగి చినిగి గాలివానగా మారి చివరకు పెద్ద తుఫాన్నే సృష్టించింది.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading