Home » Hardik Pandya : ఆ బ్యూటీని రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా?

Hardik Pandya : ఆ బ్యూటీని రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా?

by Bunty
Ad

హార్దిక్ పాండ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో ఇప్పుడు కీలక ప్లేయర్‌ గా ఉంటూ.. టీ20 లకు కెప్టెన్‌ గా కూడా కొనసాగుతున్నాడు. అయితే, తాజాగా ఈ టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్ పాండ్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. హార్దిక్ పాండ్య, నటి నటాషా స్టాంకోవీక్ లు ఫిబ్రవరి 14న అంటే రేపు… సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికి ఇంతకుముందే చట్ట ప్రకారం వివాహం అయింది. అలాగే ఈ దంపతులకు ఆగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.

Advertisement

భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా, నటాషాలు గతేడాది చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2029 మే, 31న తాము వివాహం చేసుకున్నట్లు వీరిరువురు ప్రకటించారు. జూలై 2020లో నటాషా ఆగస్త్యకు జన్మనిచ్చారు. అయితే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని పాండ్య, నటాషా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రేమికుల రోజు ఆయిన ఫిబ్రవరి 14న ఎంచుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు.

Advertisement

‘అప్పట్లో వారు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అంతా హడావిడిగా జరిగిపోయింది. తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వారికి ఎప్పటినుంచో కోరిక ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు’ అని వారు తెలిపారు. నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్ ల గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 16 వరకు కొనసాగనుంది. వీరి వివాహం ఉదయపూర్ లో జరగనుంది. నటాషా క్రిస్టియన్ అయినందున ఆదే పద్ధతిలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు నిర్వహించే హల్దీ, మెహందీ, సంగీతం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO : WPL 2023 Auction: RCBలోకి స్మృతి మంధానా, ఎల్లిస్ పెర్రీ.. రికార్డు ధర పలికిన క్రికెట్ బ్యూటీ!

Visitors Are Also Reading