1983 లో మొదటిసారి ప్రపంచ కప్ ను గెలిచిన భారత ఆ తర్వాత… 28 ఏళ్ళకి మళ్ళీ 2011 లో గెలిచింది. అయితే ఈ ప్రపంచ కప్ ధోని కారణంగానే గెలిచింది చాలా మంది అభిమానులు అంటుంటారు. కానీ ధోని ఒక్కడే ప్రపంచ కప్ గెలిపిస్తే… మిగిలిన వారు ఏం చేసారు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో చివరి సిక్స్ కొట్టి ఆయా క్రెడిట్ మొత్తం ధోనినే తీస్కున్నాడు అని ఆరోపించారు.
Advertisement
Advertisement
క్రికెట్ అనేది ఒక్క టీమ్ గేమ్. ఓ జట్టు గెలిచిన.. ఓడిన అందులో ఉన్న అందరికి అందులో బాధ్యత ఉంటుంది. కానీ చాలామంది ప్రపంచ కప్ ధోనినే గెలిపించాడు అంటున్నారు. ఆస్ట్రేలియా కనుక ప్రపంచ కప్ గెలిస్తే… ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ గెలిచింది అంటారు. కానీ మన ఇండియా గెలిస్తే… ధోని ప్రపంచ కప్ గెలిపించాడు అంటున్నారు. అతను ఒక్కడే వరల్డ్ కప్ గెలిపిస్తే… మిగిలిన 10 మంది ఆటగాళ్లు లస్సీ తాగడానికి వెళ్లారా? వాళ్లంతా ఏం చేసారు ? అని ప్రశ్నించాడు. ఫైనల్స్ లో 97 పరుగులు చేసిన గంభీర్.. ఆ టోర్నీ మొత్తం క్యానర్స్ తో పోరాడుతూ ఆడిన యువరాజ్.. వీరందరూ ఏం చేయలేదా అని అన్నారు.
ఇక గతంలో కూడా ఇదే విషయం పై గంభీర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ క్రెడిట్ మొత్తం ధోని ఒక్కడికే ఇవ్వడం కరెక్ట్ కాదు. అసలు నేను ఫైనల్స్ లో సెంచరీ చేయకపోవడానికి ధోనినే కారణం. అతను బ్యాటింగ్ కు వచ్చి నన్ను టెన్షన్ పెట్టాడు అని గంభీర్ అన్నారు. ఇప్పుడు హర్భజన్ కూడా ఇదే రీతిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.