భారత జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ స్థానంలోకి రోహిత్ శర్మ వచ్చాడు. కానీ ఓ కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. అందుకే ఈ ఏడాది టీం ఇండియాకు 8 మంది కెప్టెన్లు మారారు. అయితే రోహిత్ శర్మ ఇప్పుడు ఎక్కువ ఫిట్ గా లేడు. కాబట్టి దాదాపు ఇంకో రెండేళ్లలో రోహిత్ జట్టుకు దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Advertisement
అందుకే భారత జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరు అనే విషయపై తెగ చర్చ అనేది నడుస్తుంది. ఆ క్రమంలోనే గతంలో మూడు, నాలుగు పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు వారందరిని దాటుకొని కెప్టెన్సీ రేస్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా కెప్టెన్ గా పాండ్యకే తన ఓటు అనేది వేసాడు.
Advertisement
పాకిస్థాన్ పై పాండ్య ఆడిన విధానాన్ని మెచ్చుకున్నా హర్భజన్.. పాండ్యనే భారత జట్టుకు కాబోయే భవిష్యత్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. పాండ్య ఇప్పుడు ధోనీల మారుతున్నాడు. స్థిరంగా ఆలోచించడం.. జట్టును నడిపించడం బాగా చేస్తున్నాడు. అలాగే ఫినిషర్ గా కూడా ట్రాన్స్ చేస్తున్నాడు. అందుకే పాండ్య తప్పకుండా కెప్టెన్ అవుతాడు.. అవ్వాల్సిందే హర్భజన్ పేర్కొన్నాడు. ఇక పాండ్య కెప్టెన్ గా అవ్వడం నేను చూస్తాను అని కూడా భజ్జి కామెంట్స్ చేసాడు.
ఇవి కూడా చదవండి :