Home » ఇంటి నుంచి ఎలుకల్ని దూరంగా ఉంచాలంటే.. ఈ మొక్కలను నాటండి..!

ఇంటి నుంచి ఎలుకల్ని దూరంగా ఉంచాలంటే.. ఈ మొక్కలను నాటండి..!

by Sravanthi

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లోకి కీటకాలు వంటివి రావు. చాలామంది ఇళ్లల్లో ఎలుకలు ఉంటూ ఉంటాయి. ఎలకలు రాకుండా ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఇళ్లల్లోకి ఎలకలు రాకుండా ఉండాలంటే ఏ మొక్కలు పెంచాలి..? వీటిని పెంచితే ఎలుకలు పారిపోతాయి. ఎలకలు ఇంటికి రాకుండా ఉండడానికి బాల్కనీలో పుదీనా మొక్కని పెంచండి. ఇలా చేస్తే ఎలుకలు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ ఘాటు వాసనకి ఎలుకలు పారిపోతాయి. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది.

తులసి మొక్క నుంచి వచ్చే వాసనకి కూడా ఎలుకలు పారిపోతాయి. తులసి మొక్కల్ని ఇంట్లో వేయడం వలన ఎలుకలు రావు తులసిని తినడం వలన లాభాలు కూడా చాలా ఉంటాయి. తులసి ఆకులని నమిలితే ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎలుకలు రాకుండా ఉండేందుకు లావెండర్ మొక్కల్ని కూడా పెంచండి. ఇది మంచి సువాసనని ఇస్తుంది. లావెండర్ మొక్కని పెంచడం వలన ఎలుకలు పారిపోతాయి.

Tulasi

Also read:

ఎలుకలు రాకుండా ఉండడానికి బంతి మొక్కల్ని కూడా నాటండి. బంతిపూల ఘాటు వాసనకి ఎలుకలు రాకుండా పారిపోతాయి. ఎలుకలు రాకుండా ఉండడానికి యూక్లిప్టస్ మొక్కల్ని కూడా పెంచొచ్చు. ఈ మొక్కల ఆకుల్ని ఎలుకలు తిరిగే చోట పెడితే ఎలుకలు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. అలాగే రోజ్ మేరీని కూడా పెంచవచ్చు ఇవి కూడా ఘాటైన వాసనని కలిగి ఉంటాయి ఆ వాసనకి ఎలుకలు తట్టుకోలేవు. అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading