Telugu News » Blog » భ‌ళ్లాలదేవ సింహాసనంపై పెళ్లి కుమారుడి ఊరేగింపు..!

భ‌ళ్లాలదేవ సింహాసనంపై పెళ్లి కుమారుడి ఊరేగింపు..!

by AJAY
Ads

ఈరోజుల్లో పెళ్లి వేడుకలు కూడా మంచి ఆడంబరాలు చోటు చేసుకున్నాయి. ట్రెండ్‌ కూడా మారింది..పెళ్లంటే మెహందీ పార్టీ, డ్యాన్స్ లు ఇంకా తాహతకు తగిన ఆర్బాటపు ప్రదర్శనలుగా మారాయి. ఫలానా కుటుంబం వారి అబ్బాయి కి ఫలానా కుటుంబం వారి అమ్మాయి నిచ్చి పెళ్లి చేస్తున్నారని…ఆ పిల్లలు ఇద్ధరికి పెళ్లి అని అందరికీ తెలియటం కోసం పూర్వం పెళ్లి కుమారుడిని ఊరేగింపు గా తీసుకుని వెళ్లేవారు. అలాంటి ఊరేగింపు సాంప్రదాయ బద్ధమైన వాయిద్యాలతో చాలా సాగేది. అయితే కాలంతో పాటు వివాహసంప్రదాయాల్లో కూడా అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి…తీన్మార్ డ్యాన్సులు ఇంకా ఖరీదైన కార్లు కాన్వాయ్ ప్రదర్శనలతో ఇప్పుడు బాగా హోరెత్తిస్తున్నాయి…అయితే, దీనికి మించి కావాలనుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లికి చెందిన ఓ కుటుంబం.

Advertisement

Advertisement

పెళ్లి కుమారుడైన ఫణి పెళ్లి వేడుకల్లో భాగంగా ద్వారకాతిరుమలలో కేరళ సంప్రదాయం లో వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడతో ఆగితే వెరైటీ ఏముందనుకుంటున్నారా…అక్కడే ట్విస్ట్ ఉంది. పెళ్లి కుమారుడుని బాహుబలి సినిమాలో బళ్లాల దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ సింహాసనంపై వరుడు ఫణి ఊరేగింపు గా వెళుతుంటే అందరూ ఆశ్చర్యం గా చెప్పుకున్నారు. అయితే పోను పోను పెళ్లి సాంప్రదాయాలు ఇంకా ఏలా టర్న్ అవుతాయోనని మరికొందరు చర్చించుకుంటున్నారు..అయితే ఫణి కుటుంబ సభ్యులు మాత్రం గర్వంగా ఫీలవుతున్నారు..తమ ఇంటి పెళ్లి సందడిలో ప్రత్యేకత ఉండాలి కదా…అదే మాకు మంచి మధురానుభూతి అని వారు అంటున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతూ చక్కర్లు కొడుతుంది. ఇంకెందుకు ఆలస్యం వైరల్ అవుతున్న ఈ పిక్ ని మీరు కూడా చూసేయండి.