ఐపీఎల్ లో ఇప్పుడు సన్ రైజర్స్ అనేది ఓ పెద్ద పేరు అనే చెప్పాలి. డేకేన్ ఛార్జెర్స్ నుండి సన్ రైజర్స్ హైహరాబాద్ గా జట్టు మారిన తర్వాత అభిమానులకు చాలా దగ్గరైంది. కానీ గత ఏడాది ఆ జట్టు యాజమాన్యం చేసిన పనితో మొత్తం సన్ రైజర్స్ ఫ్యాన్స్ నుండి విమర్శలు అనేవి ఎదుర్కొంది. ఇంకా ఎదుర్కొంటూనే ఉంది. జట్టుకు 2016 లో టైటిల్ అనేది అందించిన వార్నర్ ను జట్టు నుండి తప్పించడం అభిమానులకు నచ్చలేదు.
Advertisement
ఆ విషయం అనేది పక్కన పెడితే ఇప్పుడు సన్ రైజర్స్ జట్టు తన కొత్త పేరు అనేది ప్రకటించింది. కానీ అది ఐపీఎల్ కోసం కాదు. వచ్చే ఏడాద సౌత్ ఆఫ్రికాలో ప్రారంభం కానున్న కొత్త లీగ్ లో ఆరు జట్లను మన ఐపీఎల్ జట్ల యాజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందులో సన్ రైజర్స్ కూడా ఉంది. ఇక తాజాగా సన్ రైజర్స్ తన కొత్త జట్టు పేరును ప్రకటించింది.
Advertisement
అయితే అక్కడ పోర్ట్ ఎలిజబెత్ ఆధారిత జట్టును తీసుకున్న సన్ రైజర్స్ తమ జట్టు పేరు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టులో ఉన్న సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రామ్‌తో అక్కడ జరిగే లీగ్ కోసం కూడా ఒప్పందం అనేది చేసుకుంది. అయితే ఐడెన్ మార్క్‌రామ్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును కెప్టెన్ గా నడపబోతున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :