సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోగా సక్సెస్ అయితే… మరికొంత మంది విలన్ గా సక్సెస్ అవుతుంటారు. కానీ విలన్ పాత్రలు… హీరో పాత్రలు చేసి మెప్పించే వాళ్లు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళలో మ్యాచో మాన్ గోపీచంద్ కూడా ఒకరు. 6 ఫీట్ల అందగాడు గోపీచంద్ తొలివలపు అనే సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్న మేరకు విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమాలో విలన్ రోల్ లో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా గోపీచంద్ నటన కు మంచి మార్కులు పడ్డాయి.
Advertisement
ఆ తరువాత గోపీచంద్ విలన్ గా నిజం, వర్షం సినిమాలలో నటించాడు. వర్షం సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రలో గోపీచంద్ ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ యజ్ఞం సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గోపీచంద్ కు వరుస ఆఫర్లు వచ్చాయి. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు గోపీచంద్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా గోపీచంద్ సిటీ మార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Advertisement
ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం గోపీచంద్ పక్క కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నిజానికి గోపీచంద్ కు అసలు నటనపై ఆసక్తి లేదట. గోపిచంద్ తండ్రి టి.కృష్ణ ఒకప్పుడు దర్శకుడిగా రాణించారు. సామాజిక చిత్రాలు చేసి ప్రశంసలు అందుకున్నారు.
ఇక గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ యాక్సిడెంట్ లో కన్నుమూసారు. అయితే అప్పటికే గోపీచంద్ సినిమాలపై ఆసక్తి లేక ఇంజనీరింగ్ చదవడానికి రష్యాకు వెళ్లారు. కానీ అన్న మరణవార్త తెలుసుకుని తిరిగి ఇండియాకు చేరుకున్నారు. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ కుటుంబం నుండి ఎవరైనా ఒకరు ఇండస్ట్రీలో ఉండాలని కోరడంతో గోపీచంద్ ఇష్టం లేకపోయినా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ కు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.