Home » గూగుల్ గొంతు మన కర్నూలు అమ్మాయిదే అని మీకు తెలుసా..?

గూగుల్ గొంతు మన కర్నూలు అమ్మాయిదే అని మీకు తెలుసా..?

by Sravanthi
Ad

గూగుల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. గూగుల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ గూగుల్ లో వాళ్లకి కావాల్సిన సమాచారాన్ని పొందుతారు. ఏదైనా పదానికి తెలుగులో అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే గూగుల్లో ఎంతో అందమైన గొంతు మనకి వినపడుతూ ఉంటుంది. అది ఎవరు గుంతో కాదు మన కర్నూలు అమ్మాయి గ్రీష్మ రెడ్డిది. గ్రీష్మ రెడ్డి బీటెక్ చదివి ఢిల్లీలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు.

Advertisement

గ్రీష్మ రెడ్డి స్వస్థలం కర్నూలు. తన తల్లి డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు తన తండ్రి కలెక్టర్గా రిటైర్ అయ్యారు. చెన్నైలోనే ఒక కాలేజీలో గ్రీష్మ రెడ్డి బయోటెక్నాలజీలో బీటెక్ చేశారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆమె కొన్ని కారణాల వలన ఎంబీఏ జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఆమె ఎంఏ సైకాలజీ చేసారు. స్నేహితురాలి ద్వారా గ్రీష్మ కి వాయిస్ ఓవర్ రంగం గురించి తెలిసింది. ఆ రంగంపై దృష్టి పెట్టాలని అనుకున్నారు.

Advertisement

బాల్యం నుండి మ్యూజిక్ అంటే ఆమెకి చాలా ఇష్టం డబ్బింగ్ చెప్పడం కూడా ఆమెకు చాలా ఇష్టమట, అందుకే వాయిస్ ఓవర్ దిశగా అడుగులు వేశానని ఆమె పేర్కొన్నారు, ఒకరోజు గూగుల్ నుండి కబురు వచ్చింది, గూగుల్ ట్రాన్స్లేటర్ తో గొంతు కలిపే ఛాన్స్ దక్కిందని గ్రీష్మ రెడ్డి అన్నారు. ఎన్నో వేల తెలుగు పదాలు పలకడంతో పాటుగా వందల కథనాలు చదివి పదానికి అనుగుణంగా ఉచ్చారణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆమెకి బాగా ప్లస్ అయిందట. తెలుగుతోపాటు ఇతరు భాషల్లో ప్రభుత్వం ప్రకటనల కోసం ఆమె పని చేస్తూ ఉంటారట. గ్రీష్మ రెడ్డి టాలెంట్ తో అంతకంతకు ఎదిగిపోతున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

 

Visitors Are Also Reading