హ్యాక్ బగ్ గుర్తించిన భారతీయుడికి గూగుల్ భారీ నజరానా ప్రకటించింది. గూగుల్ లో బగ్స్ గుర్తించిన వారికి నజరానా ఇస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అస్సాంకు చెందిన రోనీ దాస్ అనే యువకుడు గూగుల్ ఆండ్రాయిడ్ ఫోర్ గ్రౌండ్ సర్వీస్ లో ఒక బగ్ ను గుర్తించాడు. ఆ బగ్ సహాయంతో యూజర్ల ఫోన్ ను హ్యాక్ చేయడం తో పాటు వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉందని గుర్తించాడు. 2021 మే నెలలో రోనీ దాస్ ఈ బగ్ ను గుర్తించాడు. ఈ బగ్ ద్వారా ఫోన్ కెమెరా, మైక్రో ఫోన్ లొకేషన్ లాంటి వివరాలు హ్యాకర్ల చేతికి వెళతాయని చెబుతున్నాడు.
Advertisement
Advertisement
అయితే సెక్యూరిటీ కారణాల వల్ల బగ్ కు సంబంధించి కీలక విషయాలను మాత్రం రోనీ దాస్ వెల్లడించడం లేదు. సైబర్ అన్వేషణలో ఆసక్తి ఉన్న దాస్ గతంలో గౌహతి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్ సైట్ లో కూడా బగ్ ను గుర్తించాడు. ఇక తాజాగా గూగుల్ లో బగ్ ను గుర్తించడంతో గూగుల్ అతడికి భారీ జరిమానా ప్రకటించింది. రోనీ దాస్ కష్టానికి 5వేల డాలర్లు నజరానా ఇస్తున్నట్టు గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ మెయిల్ ద్వారా దాస్ కు తెలియజేసింది. దాంతో దాస్ ప్రస్తుతం ఆనందంలో విహరిస్తున్నాడు. అయితే దాస్ గుర్తించిన బగ్ ను గూగుల్ ఫిక్స్ చేసిందా… లేదా అనేది ఇంకా తెలియలేదు.