Home » మంచి భర్తకు ఉండాల్సిన 10 క్వాలిటీస్ ఇవే..!

మంచి భర్తకు ఉండాల్సిన 10 క్వాలిటీస్ ఇవే..!

by AJAY
Ad

పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాలంటే వారిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అయితే ఇప్పుడు మంచి భర్త లో ఇలాంటి క్వాలిటీ లు ఉండాలో తెలుసుకుందాం. భర్త తన భార్య పై ప్రేమ చూపిస్తూ ఉండాలి. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉన్నా సరే భార్య కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆమెపై ప్రేమ చూపించాలి. ఆమెకు నచ్చిన ప్రదేశాలకు తీసుకు వెళ్లడం…. ఆమెకు నచ్చినట్టుగా ఉండటం లాంటివి చేయాలి.

Advertisement

భర్తలు భార్యల కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. భార్యాభర్తలు అన్న తర్వాత ఇద్దరి మధ్య గొడవలు కామన్…. అయితే ఇద్దరిలో ఎవరు ముందు సారీ చెబుతారా అని చూడకుండా భర్త సారీ చెప్పడం వల్ల ఆమెకు మరింత దగ్గర అవ్వచ్చు. మగవాళ్ళు ఇతర పనుల్లో బిజీగా ఉండటం కామన్ కానీ పిల్లల బాధ్యతను పూర్తిగా భార్యకే అప్పగించడంతో వాళ్లు సైతం పిల్లల బాధ్యతను చూసుకోవాలి.

Advertisement

ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కొంతమంది భర్తలు పిల్లలను పట్టించుకోరు. కానీ అలా చేయకుండా భర్తలు సైతం పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలి. కుటుంబంలో భర్త భార్యను డామినేట్ చేయాలని చూస్తారు. మగవాళ్లు సంపాదిస్తున్నామని మేమే గొప్ప అని చెప్పుకుంటారు. కానీ అలా ఉండకుండా భార్యను ఎక్కడా కూడా డామినేట్ చేయవద్దు. కుటుంబాన్ని అప్పుడప్పుడు బయటకు తీసుకు వెళ్లాలి.

సరదాగా ట్రిప్పులు లాంటి వాటికి తీసుకెళ్లడం ద్వారా మరింత బంధం బలపడుతుంది. అలాంటి భర్తలే ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటారు. భార్యకు కాస్త పర్సనల్ స్పేస్ ను కూడా ఇవ్వాలి… పూర్తిగా అజమాయిషీ చెల్లించకుండా ఆమె ఇష్టాలను కూడా గౌరవిస్తూ ముందుకు సాగాలి. భార్య అంటే భర్త లో సగభాగం అంటారు. కాబట్టి వారి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండాల్సిన అవసరం లేదు.. భర్త తన సీక్రెట్స్ భార్యకు చెప్పుకోవడం మంచిది.

Visitors Are Also Reading