Home » TCS టెకీలకు గుడ్ న్యూస్.. నియామ‌కాల‌పై టీసీఎస్ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు

TCS టెకీలకు గుడ్ న్యూస్.. నియామ‌కాల‌పై టీసీఎస్ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు

by Anji
Ad

గ‌త ఏడాది పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించిన అనంత‌రం దేశీ ఐటీ దిగ్గ‌జం టీసీఎస్ టెకీల‌కు తీపిక‌బురు అందించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల నియామ‌కాల‌ను పెంచాల‌ని టీసీఎస్ యోచిస్తోంది. నాస్కామ్ స‌ద‌స్సులో టీసీఎస్ హైరింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను సీఈవో కే కృతివాస‌న్ వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

రిక్రూట్‌మెంట్ ప్ర్రక్రియ‌ను నిలువ‌రించే ప్ర‌ణాళిక‌లేమీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు. టీసీఎస్ త‌న హైరింగ్ ఆలోచ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని, రిక్రూట్‌మెంట్ విష‌యంలో కుదింపులు ఏమీ ఉండ‌వ‌ని తేల్చిచెప్పారు. ఇక టీసీఎస్‌లో ఇంటి నుంచి ప‌నిచేసే ప‌ద్ధ‌తికి స్వ‌స్తి ప‌లుకుతామ‌ని పేర్కొన్నారు. కార్యాల‌య వాతావ‌ర‌ణం, ముఖాముఖి సంప్ర‌దింపుల‌తోనే విలువైన విష‌యాలు నేర్చుకోగ‌లుగుతార‌ని రిమోట్, హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్స్ గురించి ప్ర‌స్తావిస్తూ వ్యాఖ్యానించారు. సంస్ధాగ‌త క‌ల్చ‌ర్‌, విలువ‌ల మెరుగుద‌ల‌కు ఈ మోడ‌ల్స్ స‌రైన‌వి కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఏఐపై అతిగా ఆధార‌ప‌డ‌కుండా చూసుకోవాల‌ని, ప‌ని ప్ర‌దేశాల్లో జ‌న‌రేటివ్ ఏఐతో మాన‌వ సామ‌ర్ధ్యాలు మెరుగవుతాయ‌ని పేర్కొన్నారు.

Also Read :  తెలంగాణ పోరాటంలోనూ.. సమ్మక్క సారలమ్మల స్ఫూర్తి.. కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Visitors Are Also Reading