Home » బ‌ట్ట‌త‌ల ఉన్న‌వారికి గుడ్ న్యూస్..ఆ ప్రోటీన్ తో మ‌ళ్లీ కొత్త జుట్టు..!

బ‌ట్ట‌త‌ల ఉన్న‌వారికి గుడ్ న్యూస్..ఆ ప్రోటీన్ తో మ‌ళ్లీ కొత్త జుట్టు..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం పట్టుమ‌ని పాతికేళ్లు కూడా రాక‌ముందే జుట్టు రాలటం మొద‌ల‌వుతోంది. దాంతో యువ‌త ఎంతో ఆందోళ‌న చెందుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు రాలే స‌మస్య రావ‌డంతో ఎంతో నామూషీగా ఫీల్ అవుతున్నారు. అయితే జుట్టు రాల‌డాల‌ని కార‌ణం ఏంట‌ని ఎవ‌రిని అడిగినా ఒత్తిడి అనే చెబుతున్నారు. తాజాగా ఓ ప‌రిశోధ‌న‌లో కూడా అదే నిర్దార‌ణ అయ్యింది. అంతే కాకుండా ఆ ప‌రిశోధ‌న త‌ర్వాత శాస్త్ర‌వేత్త‌లు ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పారు. అయితే ఏంటి ఆ గుడ్ న్య‌స్…ఆ ప‌రిశోధ‌న చేసిందెవ‌ర‌న్న‌ది ఇప్పుడు చూద్దాం….తీవ్ర‌మైన ఒత్తిడి మ‌రియు ఇత‌ర కార‌ణాల వల్ల జుట్టు ఊడిపోతుంద‌ని తాజాగా హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా బ‌ట్ట‌త‌ల పై జుట్టును తిరిగి మొలిపించే ప‌రిష్కారాన్ని కూడా క‌నుగొన్నారు. జుట్టు పెరుగుద‌లకు జీఏఎస్6 అనే ప్రోటీన్ కార‌ణమ‌వుతుంద‌ని గుర్తించారు. అయితే అనేక కార‌ణాల వ‌ల్ల ఆ ప్రోటీన్ అణ‌చివేయ‌బ‌డి జుట్టు రాల‌టం ప్రారంభం అవుతుంద‌నివారు చెబుతున్నారు. అంతే కాకుండా ఒక‌వేళ జీఎస్6 ప్రోటీన్ ను శ‌రీరంలో పెంచ‌గ‌లిగితే జుట్టు మ‌ళ్లీ పెరుగుతుంద‌ని..జుట్టు రాలే స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ఇక ఇప్ప‌టికే ఈ ప్ర‌యోగాన్ని ఎలుక‌ల‌పై హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు పూర్తి చేశారు. 15 రోజుల పాటూ ఎలుక‌ల‌కు జీఎస్6 ప్రోటీన్ ఇవ్వ‌గా వాటిలో ఎంట్రుక‌లు మొల‌వడాన్ని శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. ఇక త్వ‌ర‌లోనే ఈ ప్ర‌యోగాన్ని మ‌నుషుల‌పై కూడా జ‌ర‌ప‌నున్నారు. ఈ ప్ర‌యోగం క‌నుక స‌క్సెస్ అయితే ఇక‌పై జుట్టు పెరిగేందుకు..జుట్టు రాలడాన్ని ఆపేందుకు చిట్కాలు పాటించ‌డం అవ‌స‌రం లేదు. కేవ‌లం జీఎస్6 ప్రోటీన్ తీసుకుంటే స‌రిపోతుంది.

Visitors Are Also Reading