Home » తల్లి తదనంతరం తరువాత బంగారం ఎవరికీ చెందుతుంది..? కూతురికా..? కోడలికా..?

తల్లి తదనంతరం తరువాత బంగారం ఎవరికీ చెందుతుంది..? కూతురికా..? కోడలికా..?

by Anji
Ad

ప్రస్తుతం తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే ఆస్తి కోసం కూతుర్లు, కొడుకులు కొట్టుకుంటున్నారు. ఇక వారు మరణించిన తరువాత కూడా ఎన్నో వివాదాలు జరగడం మనం నిత్యం చూస్తేనే ఉంటున్నాం. అయితే ముఖ్యంగా తల్లి బతికి ఉండగానే ఆమె ఒంటిమీద ఉన్న బంగారం, ఆమె దాచుకున్న డబ్బు ఏదైనా ఉంటే అవన్నీ ఎవ్వరికీ చెందుతాయి..? కోడలు కి చెందుతాయా..? లేక కూతురు కి చెందుతాయా..? ప్రస్తుత పరిస్థితిలో అమ్మ దాచుకున్న డబ్బు నాకే చెందుతుందని కూతురు, నాకే చెందుతుందని కోడలు మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

Advertisement

వాస్తవానికి ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రశ్న తలెత్తదు. ఈ విషయాన్ని మూడు రకాల్లో చూడాల్సి వస్తుంది. తొలుత చట్టం ప్రకారం.. ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికీ తల్లి బంగారం చెందుతుది. కొడుకులు, కూతుర్లు ఎంతమంది ఉంటే అంతమంది వారసులకు ఆమె బంగారం మీద హక్కు ఉంటుంది. పొలం, స్థలం, ఇల్లు వంటి ఆస్తుల్లో కూడా కొడుకుతో పాటు సమానంగా కూతురుకి చెందుతుందని చట్టం పేర్కొంటుంది. అలాగే బంగారం విషయంలో కూడా సమాన వాటా కూతుర్లకు ఉంటుంది.

Advertisement

సాంప్రదాయం ప్రకారం.. వృద్ధాప్యంలో తల్లికి సేవ చేసేది కొడుకు, కోడలు కాబట్టి అత్తగారి బంగారం ఆమె మరణించిన తరువాత కోడలుకు చెందుతుందని పెద్దలు చెబుతారు. అత్తగారిని బాగా చూసుకుంటేనే అత్తగారి బంగారం మీద కోడలుకి హక్కు ఉంటుంది. కూతురుకి ఎందుకు చెందదు అంటే.. కూతురికి డబ్బు, ఆస్తి, అలాగే బంగారం కట్నంగా ఇస్తారు. కాబట్టి తల్లి దగ్గర మిగిలిన బంగారం మరలా కూతురికీ ఇవ్వడం ఎందుకు అని పెద్దలు అంటుంటారు. కూతురికి కాకుండా కోడలికి ఇస్తేనే బాగుంటుందని చెబుతారు. మరికొందరూ పెద్దలు అత్తగారితో కలిసి ఉండేది.. కోడలే కాబట్టి కోడలుకే చెందాలని చెబుతుంటారు. సాంప్రదాయం ప్రకారం.. కూతురు లేదా కోడలు ఇద్దరిలో ఎవరైనా సరే బంగారాన్ని ఎవ్వరూ  తీసుకుంటే వారు కచ్చితంగా తల్లిని చూడటం ధర్మం. 

ఇక మానవత్వ కోణం ప్రకారం.. బంగారం, డబ్బు, ఆస్తులు ఏవి కూడా శాశ్వతం కాదు.. ఆర్థిక పరిస్థితి బాగున్నా.. బాగోలేకున్నా ఎలా ఉన్నా సరే అమ్మనే ముఖ్యం. ఆ అమ్మనే బంగారు గని అనుకుంటే కొడుకు గొప్పోడు అవుతాడు. అత్తగారు అయితే ఏమైంది.. తల్లి తరువాత తల్లే కదా అనుకుంటే ఆ అల్లుడు గొప్పోడు అవుతాడు. మాకు బంగారం కంటే బంధాలే ముఖ్యం అని ఆడబిడ్డ అనుకుంటే ఆమెను మించిన అష్టలక్ష్మీ ఇంకెవ్వరూ ఉండరు. లక్ష్మీదేవి ఉన్న చోట గొడవలుండవు. మహాలక్ష్మీ అంటే మంచి మనస్సు. జన్మనిచ్చారు కాబట్టి పరిస్థితులు బాగున్నా.. బాగా లేకున్నా తల్లిదండ్రులను చూడటం అనేది ధర్మం. పిల్లలను సమానంగా చూడని తల్లిదండ్రులు అయినా.. సమానంగా ఆస్తి పంచని తల్లిదండ్రులు అయినా సరే జన్మనిచ్చిన బంధానికి ఏమి ఆశించకుండా వారి రుణం తీర్చుకోవడం ఉత్తముల లక్షణం. రుణ బంధాన్ని భారంగా కాకుండా.. బాధ్యతగా భావిస్తే కుటుంబ కలహాలుండవు. కల్మషం లేకుండా జీవిస్తే.. జీవితాలు బాగుంటాయి.

Also Read :  ఈ శివుడిని దర్శిస్తే.. కాశీని దర్శించిన పుణ్యమట.. ఈ ఆలయం ఎక్కడుందంటే..?

Visitors Are Also Reading