దీపావలి పండుగ తరువాత చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. ఈసారి చిన్నారుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్నారుల్లో సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఇలాంటి చిన్నారులను దగ్గు, జలుబు, ఆస్తమాతో పాటుగా చర్మ సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. శీతాకాలంలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం పిల్లలకు ఇవ్వడం చాలా అవసరం.
Advertisement
చలికాలంలో పిల్లలకు పాలు, పాల సంబంధిత పదార్థాలు వద్దు. వీటితో పాటు వెన్న, జున్ను, క్రీమ్ వంటి పాల పదార్థాలు కూడా పిల్లలు ఇష్టంగా తింటుంటారు. శీతాకాలం ఈ అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. పాలు, పాల పదార్థాలలో జంతువులకి సంబంధించిన కొవ్వులు నోట్లోని లాలాజలం, శ్లేష్మాన్ని గట్టిపడేవిధంగా చేస్తాయి. దీని ద్వారా ఆహారం మింగడంలో ఇబ్బంది అవుతుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. వెన్నను కొన్ని పిండి వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. వీటిని నూనెలో వేయించి తినడం వల్ల ఎక్కవగా నూనె, కొవ్వులు శరీరంలోకి చేరుతాయి. ఆరోగ్యానికి ఇవి మంచిది కాదు. శీతాకాలంలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది.
Advertisement
Also Read : కంటి చూపు తగ్గుతున్నట్టు అనిపిస్తోందా ? మీ డైట్‌లో ఇది తప్పక చేర్చుకోండి..!
పిల్లలు ఇష్టపడే క్యాండీష్, కేక్స్, శీతల పానియాలు, ఐస్‌క్రీమ్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లలను వీటికి ఎంత దూరంగా ఉంచితే వారి ఆరోగ్యానికి అంత మంచిది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పచ్చళ్లు, పులియబెట్టిన ఆహార పదార్థాల్లో హిస్టమైన్ అనే రసాయనం అధిక మొత్తంలో ఉంటుంది. మాంసాహారాలు చాలా తక్కువగా తీసుకోవాలి. అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి గొంతు, నొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను మాంసాహారాలు తెచ్చిపెడతాయి. ఒకవేళ పిల్లలకు మాంసం పెట్టాలనుకుంటే పెంచిన కోళ్లు, మేకలు మాంసాహారాలు అందించడం బెటర్.
Also Read : మీ చెవిలో ఏదైనా పడిందా..? అయితే ఇలా చేస్తే ఫలితం పక్కా ..!