టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న నిత్యా మీనన్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మలయాళ బ్యూటి. తన తొలి సినిమాతోనే యూత్ యమ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇష్క్, గుండె జారీ గల్లంతయిందే. సెగ, స్కైలాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నిత్య చివరిసారిగా పవన్ సరసన భీమ్లానాయక్ సినిమాలో నటించింది. ఇటీవల మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది నిత్య.
Advertisement
తాజాగా ఓ స్పెషల్ వీడియో విడుదల చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది నిత్యామీనన్. తాను యాక్టింగ్ కి బ్రేక్ ఇస్తున్నానని.. అందుకు కారణం పెళ్లి మాత్రం కాదని వెల్లడించింది. నేనే పెళ్లి చేసుకోవడం లేదు. అది ఒక పెద్ద స్టోరీ మాత్రమే. ఈ కథలో ఎవ్వరూ లేరు. ఇంకా ఐదారు ప్రాజెక్ట్ విడుదల కావాల్సి ఉన్నాయి. ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. నేను ఇప్పటివరకు కష్టపడి పని చేశాను కాబట్టి కాస్త విరామం కావాలి. ఎందుకంటే నా కాలు నొప్పి కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే పని చేయడం ప్రారంభించాను.
ఇక ఇప్పుడే నా పాదాలపై లేవడం మొదలు పెట్టాను. సరైన సమయంలో నా ప్రాజెక్ట్ అన్నింటిని పూర్తి చేయగలిగాను. కొద్ది రోజుల పాటు నేను బ్రేక్ తీసుకుంటున్నాను. ఆ తరువాత మళ్లీ నటిస్తానని చెప్పుకొచ్చింది. నా పెళ్లికి సంబంధించి కాల్స్ రావని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వార్తలు అసలు వాస్తవం కాదు. నేను బ్రేక్ తీసుకుంటున్నది కేవలం నాకు రెస్ట్ కావాలని మాత్రమే. పెళ్లి కోసం మాత్రం కాదని చెప్పుకొచ్చింది. ఇటీవలే నిత్య ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన విషయం విధితమే.
Also Read :
టాలీవుడ్ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. షూటింగ్స్ బంద్..!
“జబర్దస్త్” కామెడీ షోలో కట్టుకున్న చీరలను ఆ తరవాత ఏం చేస్తారో తెలుసా…?