జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకప్పుడు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. జీవితంలో స్థిరపడిన తరవాతనే అమ్మాయిలకు అయినా అబ్బాయిలకు అయినా పెళ్లిళ్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు పెళ్లి అనేది తల్లిదండ్రుల నిర్నయం. వాళ్లు ఎవరిని చేసుకోవాలని చెబితే వారినే చేసుకునేవారు.
Advertisement
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తున్నారు. నచ్చితేనే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అమ్మాయిలకు 20 ఏళ్లు దాటిన తరవాత తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా తల్లిదండ్రులు పెళ్లి విషయం ఎత్తినప్పుడు చాలా మంది అమ్మాయిల ఆలోచనలు ఏవిధంగా ఉంటాయి అనే దానిపై మానసిక నిపుణులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
పెళ్లి మ్యాటర్ వచ్చిన వెంటనే అమ్మాయిలు తమకు కాబోయేవాడు రాజకుమారుడిలా ఉండాలని కలలు కంటారట. ఖచ్చితంగా అందంగా ఉండాలని అనుకుంటారట. అంతే కాకుండా తమకు ఆస్తులు ఉన్నా లేకపోయినా చేసుకునేవాడికి ఆస్తులు ఉండాలని కలలు కంటారట. పెళ్లి చేసుకున్న తరవాత విదేశాల్లో స్థిరపడాలని అనుకుంటారట.
అయితే అమ్మాయిలు అలా కాకుండా జీవితంలో స్థిరపడ్డాడా లేదా అనేది చూడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం చేస్తున్నాడా..? కుటుంబాన్ని పోశించగలడా లేదా అనేది గమనించాలని చెబుతున్నారు. అందానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా అతడి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా ప్రేమగా చూసుకుంటాడా లేదా అనేది ఆలోచించాలని సూచిస్తున్నారు.