Home » అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి అబ్బాయిలనే ఇష్టపడతారట ! ఆ రహస్యాలు ఎవరితో చెప్పారట !

అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి అబ్బాయిలనే ఇష్టపడతారట ! ఆ రహస్యాలు ఎవరితో చెప్పారట !

by Anji
Ad

సాధార‌ణంగా అమ్మాయిలు త‌మ మ‌న‌సులోని భావాల‌ను ఎవ‌రితోనూ పంచుకోరు. అస‌లు ఎదుటి వ్య‌క్తి గురించి తెలుసుకోకుండా వారితో స్నేహం చేయ‌డానికి సుముఖ‌త చూపించ‌రు. మ‌న‌సులోని మాట‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను పంచుకొని అమ్మాయిల‌ను అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. అబ్బాయిల‌తో పోల్చుకుంటే అమ్మాయిలు త‌మ ఇష్టాల‌ను అయిష్టాల‌ను చాలా త‌క్కువ మందితో పంచుకుంటారు.

Also Read :  “ఇంద్ర” క్రియేట్ చేసిన ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టలేక‌పోయిన బాహుబ‌లి…!

Advertisement

ఎప్పుడూ వారికి సంబంధించిన విష‌యాల‌ను ర‌హ‌స్యంగా ఉంచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ముఖ్యంగా అమ్మాయిల‌తో స్నేహం చేయాల‌నుకునేవారు ముందుగా వారి మ‌న‌స్త‌త్వాల‌ను తెలుసుకోవాల‌ని అంటుంటారు. వారు త‌మ ర‌హ‌స్యాల‌ను ఎవ‌రితో పంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఎవ‌రికో ఒక‌రికి మాత్రం త‌ప్ప‌కుండా చెబుతుంటారు. ఈ విష‌యాల‌ను ఎలా అర్థం చేసుకుంటారో వారితో స్నేహం ఎలా చేయాల‌నే విష‌యాలు అవ‌గాహ‌న‌కు వ‌స్తే.. వారితో స్నేహం ఎక్కువ కాలం బ‌లంగా ఉంటుంది. అమ్మాయిలు వారి మ‌న‌స్సులో ఉండే ఆలోచ‌న‌లు.. ఎలాంటి అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తారో తెలుసుకోండి


నివేదిక ప్ర‌కారం అమ్మాయిలు కళ్ల‌తో మాట్లాడే అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. క‌ళ్ల‌లోకి చూస్తూ మాట్లాడే అబ్బాయిలు ఎంతో నిజాయితీగా ఆత్మ‌విశ్వాసంతో ఉంటారు అని.. అందుకే అలాంటి అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. నేల‌వైపు చూస్తూ మాట్లాడ‌డం.. లేదా చుట్టు ప‌క్క‌ల చూస్తూ మాట్లాడే వారిని అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. అదేవిధం ప్ర‌తి విష‌యాన్ని జ‌డ్జ్ చేసే అబ్బాయిల‌ను అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ర‌ట‌. అదేవిధంగా వారికి రూల్స్ పెట్ట‌డం.. చేసే ప్ర‌తి ప‌నికి అడ్డు చెప్పే అబ్బాయిల‌ను అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. అబ్బాయిల మాట తీరును ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి అమ్మాయిల ఉద్దేశం మారుతుంది.

Advertisement

అమ్మాయిలు స‌ర్‌ప్రైజ్‌ల‌ను ఆశ్చ‌ర్యాల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. కానీ ఈ విష‌యాల‌ను వారు ఎప్ప‌టికీ బ‌య‌ట‌పెట్ట‌డ‌రు. ప్ర‌తి అమ్మాయి స‌ర్‌ప్రైజ్‌లను ఇష్ట‌ప‌డుతుంది. స్నేహితురాలు, భార్య, సోద‌రి, ఎవ‌రైనా స‌రే స‌ర్ ప్రైజ్ ఇష్ట‌ప‌డుతుంది. అమ్మాయిల‌తో ఎక్కువ‌గా బాండింగ్ ఏర్ప‌డాలంటే వారికి ఎప్ప‌టిక‌ప్పుడూ చిన్న స‌ర్‌ప్రైజ్ ఇస్తుండాలి. జాయ్‌పుల్‌గా ఉండే అబ్బాయిల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ఎప్పుడు విచారంగ త‌మ క‌ష్టాల‌ను చెప్పుకుంటూ ఉండే అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌రు.


ఒక‌వేళ మీరు మీ స‌మ‌స్య‌ల‌ను కూడా ఎక్కువ‌గా అమ్మాయిల ముందు చెప్పుకుంటే వెంట‌నే మీ స్వ‌భావాన్ని మార్చుకోవాలి. ఎప్పుడు ఫ‌న్నీగా జోక్స్ చేస్తూ సంతోషంగా ఉండే అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అమ్మాయిల‌కు ఎప్పుడూ గౌర‌వంగా మాట్లాడే అబ్బాయిలంటే ఇష్ట‌ముంటుంది. ఈ విష‌యాన్ని వారు బ‌య‌ట‌కు చెప్ప‌రు. ఇత‌రుల‌కు గౌర‌వమిస్తూ మాట్లాడే అబ్బాయిల‌ను ఎప్పుడూ గ‌మ‌నిస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా మ‌హిళ‌ల‌తో గౌర‌వంగా న‌డుచుకోవ‌డం, వారితో గౌర‌వంగా మాట్లాడే వారిని ఎక్కువ‌గా అమ్మాయిలు ఇష్ట‌ప‌డతార‌ట‌.

Also Read :  RRR : విడుద‌ల‌కు ముందే క‌థ మొత్తం లీక్‌..! ఇక క్లైమాక్స్ అదిరిపోయింద‌ట‌..!

Visitors Are Also Reading