క్రికెట్ లో జాతీయ జట్లకు ఆడే అవకాశాలు రావడం చాలా కష్టం అనే చెప్పాలి. కొంత మందికి టాలెంట్ ఉన్నా అవకాశాలు రావు. అవకాశాల కోసం ఏళ్లు ఎదురుచూసినా ఒక్క ఛాన్స్ కూడా రాకపోవచ్చు. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమను తాము ప్రూవ్ చేసుకున్న ప్లేయర్లకు మాత్రం తిరుగు ఉండదు. ఫెయిల్ అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అంత సులువు కాదు. టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తనకు వచ్చిన ప్రతీ ఛాన్స్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కి తన గేమ్ ని మరింత ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు.దీంతో జాతీయ జట్టుతో పాటు ఇటు కాసులు కురిపించే ఐపీఎల్ లోనూ దుమ్మురేపుతున్నాడు. టెస్ట్ లతో పాటు వన్డేలు, టీ20లోనూ భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు గిల్.
Advertisement
ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ తరుపున ఈ ఏడాది అదురగొట్టాడు. రెండు సెంచరీలు సహా 890 రన్స్ చేసి ఆరేంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తొలి ఐపీఎల్ కప్ గెలవడంలో శుభ్ మన్ గిల్ కీలక పాత్ర పోషించాడనే చెప్పవచ్చు. అదేవిధంగా సీజన్ ఫైనల్ కి రావడంలో శుభ్ మన్ కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా హార్దిక్ పాండ్యా సార్థ్యంలోని గుజరాత్ బ్యాటింగ్ లైనఫ్ లో శుభ్ మన్ గిల్ ప్రధానబలంగా మారాడు. గిల్ గుజరాత్ ఫ్రాంచైజీని వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024లో గుజరాత్ కు గుడ్ బై చెప్పి.. ఇతర జట్టులో చేరాలనే యోచనలో భారత ఓపెనర్ ఉన్నట్టు సమాచారం. గుజరాత్ టీమ్ లో తనకు పెద్దగా ప్యూచర్ ఉండదని గిల్ భావిస్తున్నట్టు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
టీమ్ కి కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా వయస్సు కేవలం 29 ఏళ్లు మాత్రమే. ఈ నేపథ్యంలో అతడు ఫిట్ గా ఉంటే.. ఏడు నుంచి ఎనిమిది ఏళ్లు గుజరాత్ ని సారథిగా ముందుండి నడిపే అవకాశాలున్నాయి. గుజరాత్ కి ఎన్నేళ్లు ఆడినా ప్లేయర్ గా ఉండిపోతాననే భయం గిల్ లో ఉందట. అందుకే వచ్చే ఐపీఎల్ లో తనకు కెప్టెన్సీ ఆఫర్ చేసే టీమ్ లోకి మారాలని భావిస్తున్నాడట గిల్.దాదాపు వచ్చే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ లేదా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు మారాలనే ఆలోచనలో ఉన్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడంతో తనను కెప్టెన్ చేస్తే గుజరాత్ టీమ్ లో ఉండాలని లేదా జట్టును వీడాలని ఫిక్స్ అయ్యాడట.
గిల్ ఎక్కువగా పంజాబ్ జట్టు వైపు ఆసక్తి చూపిస్తున్నాడట. ఐపీఎల్ లో సొంత నగరాలకు ఆటడం, కెప్టెన్సీ చేయడం గొప్పగా భావిస్తారు. సొంత సిటీకి చెందిన ఫ్రాంచైజీలకు గతంలో కొందరూ స్టార్లు కెప్టెన్సీ చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ కి గంగూలీ, ముంబై ఇండియన్స్ కి సచిన్ టెండూల్కర్, ఆర్సీబీకి అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వంటి వారు నాయకత్వం వహించారు. ప్రస్తుం రోహిత్ శర్మ కూడా తన సొంత నగరం ముంబైకి కెప్టెన్ గా ఉన్నాడు. దీంతో గిల్ పంజాబ్ కింగ్స్ టీమ్ కి షిప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
వరల్డ్ కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా రీ ఎంట్రీ..!
బిగ్ బాస్ 7 కి అంతా సిద్దం.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..!