మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ సరికొత్త కథలను ఎంచుకుంటూ హీరోగా మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇక ఇప్పటివరకు వరుణ్ తేజ్ సినిమాలో చాలా వరకు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ మెగా హీరో నటించిన ఎఫ్ 2 గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో కిక్ బాక్సర్ గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా గని టీం అతడిని స్పెషల్ గ్లింప్స్ విడుదల చేసి సర్ప్రైజ్ చేసింది. మెగా అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ను అందించింది.
Advertisement
Advertisement
ఈ స్పెషల్ వీడియో లో వరుణ్ తేజ్ అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు. కండల దేహంతో కిక్ బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వీడియో లో హీరో టైర్ లపై పంచ్ లు వేస్తూ పడేసిన సీన్ హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించారు.