తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఓవైపు పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై మరొక వైపు గ్రూపు-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే చాలా కష్టపడాలి. ఇప్పటికే పోలీస్, ఎస్సై ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ప్రిపెర్ అవుతున్నారు. గతంలో ప్రిపేర్ అయి ఉద్యోగం పొందని వారు సైతం కాంపిటేషన్‌లో ఉన్నారు. ఇక గ్రూపు-1 విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. గ్రూపు-1 విషయంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఉద్యోగ నియామక పరీక్షలలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి ప్రత్యేక పేపర్‌ను నియామకపరీక్షలో ఉంది. గ్రూపు 2తో పాటు గ్రూపు-1లో కూడా ఈ పేపర్ కలదు.
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి వివిధ ముఖ్యమైన ఘట్టాలపై అవగాహన ఉంటే ఈ పేపర్‌లో మంచి మార్కులనే సాధించవచ్చు. ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, ఉప ఎన్నికలు, కేసీఆర్ దీక్ష, జేఏసీ ఏర్పాటు, సకల జనుల సమ్మె, పదవులకు రాజీనామాలు, చిదంబరం ప్రకటన, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, కమిటీ నివేదిక, కాంగ్రెస్ కమిటీలో తెలంగాణ ఏర్పాటుకు తీర్మాణం, పార్లమెంట్‌లో బిల్లు అనంతరం జరిగిన పరిణామాలపై ముఖ్యంగా తప్పకుండా క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
Advertisement
అదేవిధంగా ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, కవులు, కళాకారుల పాత్ర, అత్యంత ప్రాచుర్యం పొందిన తెలంగాణ ఉద్యమం పాటలు, తెలంగాణ అమర వీరుల గురించి తెలుసుకుంటే ఈ పేపర్‌లో మంచి మార్కులే సంపాదించవచ్చు. ప్రణాళిక బద్ధంగా క్రమపద్దతిలో చదివితే ఈ పేపర్‌లో అధిక స్కోర్ సాధించవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా టీ-సాట్‌లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పలు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. టీ సాట్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దాదాపు 45 వీడియోలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://www.tsat.tv/series/telangana-formation ఈ లింక్ ద్వారా ఆ వీడియోలను వీక్షించి అవగాహన పెంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం తెలంగాణ ఉద్యమాన్ని ఇలా ప్రిపేర్ అయి గ్రూప్-1 ఉద్యోగాన్ని పొందండి.
Also Read :
కేజీఎఫ్ చాప్టర్-3 పై అయ్యప్ప శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…అందుకే తాను బతికున్నా అంటూ…!