అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపనకి పనులు జోరుగా సాగుతున్నాయి. భారతదేశం మొత్తం శ్రీరామనామంతో మునిగిపోయింది. రామ భక్తి మనదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా విస్తరిస్తోంది. జర్మనీ గాయకురాలు రాముడికి సంబంధించిన అందమైన పాటని అద్భుతంగా పాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ జర్మనీ సింగర్ పేరు కాసాండ్రా మే స్పిట్ మన్ ఆమె పాట ఇప్పటికే ఇండియాలో బాగా పాపులర్ అయిపోయింది.
Advertisement
Advertisement
ఆ పాట రాం అయేంగే తో అంగనా అని సాగుతుంది ఆమెని ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో రామ్ భజన్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో కొత్త రామునికి సంబంధించిన భక్తి పాటల్ని పంచుకోవాలని పిఎం నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఈ సింగర్ పాడిన పాట వీడియో వైరల్ అయిపోతుంది. అయోధ్య లో ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం కొనసాగుతోంది ఇవాళ కూడా పలు పూజలు చేశారు. అయోధ్య లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం మూడు లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి వీటిలో మొత్తం 13 బ్లాక్ లని నిర్మిస్తున్నారు.
Video of German Singer Cassandra Mae Spittmann singing the devotional song ‘Ram Aayenge’ has gone viral on social media. pic.twitter.com/4lg5KMcpKR
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 18, 2024
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!