Home » Poyal Gosh : గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్‌తో వేధించేవాడు..పఠాన్‌ కూడా !

Poyal Gosh : గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్‌తో వేధించేవాడు..పఠాన్‌ కూడా !

by Bunty
Ad

పాయల్ ఘోష్ మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. క్రికెటర్ల గురించి మాట్లాడి హైలెట్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా పాయల్ తన గతాన్ని గుర్తు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లను టార్గెట్ చేసింది. ఒకప్పుడు గౌతమ్ గంభీర్ తన వెంటపడ్డాడని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. పదేపదే మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడని పోస్ట్ చేసింది. ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్ చేశానంటూ ఓపెన్ అయిపోయింది. 2013 నుంచి ఐదేళ్లపాటు డేటింగ్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. గంభీర్ మిస్డ్ కాల్స్ ఇచ్చిన విషయం పటాన్ కు తెలుసని చెప్పింది. తన ఫోన్ ను ఇర్ఫాన్ చెక్ చేసేవాడని సోషల్ మీడియాలో హీట్ పెంచింది. గంభీర్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా తనని ఇష్టపడ్డాడని చెప్పుకొచ్చింది.

Gautam Gambhir Gave Missed Calls When I Dated Irfan Pathan For 5 Years said Payal Ghosh

తాను మాత్రం ఇర్ఫాన్ ను ప్రేమించానని చెప్పింది. ఇర్ఫాన్ ను తప్ప మరెవరిని చూడలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది. తన గురించి అన్ని విషయాలు మాజీ క్రికెటర్ కు తెలుసని చెప్పింది. డొమెస్టిక్ మ్యాచ్ కోసం పూణేలో ఉన్నప్పుడు ఇర్ఫాన్ ను కలిశానంది. అన్న యూసుఫ్ పఠాన్, హార్దిక్ పాండ్యా బ్రదర్స్ ముందే గౌతీ మిస్డ్ కాల్స్ విషయాన్ని పటాన్ ప్రస్తావించాడు అంటూ బాంబు పేల్చేసింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పై తనకు గౌరవం ఉందని, అతను ఎప్పుడూ తనతో మిస్ బిహేవియర్ చేయలేదని ట్వీట్ చేసింది. పాయల్ గోష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినీ బ్యూటీకి మిస్డ్ కాల్స్ ఇచ్చిన గౌతీ మామూలోడు కాదంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఏకంగా డేటింగ్ చేశాడంటూ ఇర్ఫాన్ ను ఆడేసుకుంటున్నారు. మాజీలు మహా ముదుర్స్ లా ఉన్నారని సరదాగా మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Advertisement

పాయల్ గోష్ కామెంట్స్ పై ఇర్ఫాన్, గంభీర్ స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు అంటున్నారు. గతంలో బాలీవుడ్ సెలబ్రిటీ అనురాగ్ కశ్యప్ మీద కూడా పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ మ్యాటర్ బాలీవుడ్ లో దుమారం రేపింది. ఇక ఇటీవలే వన్డే వరల్డ్ కప్ సమయంలోను పాయల్ గోష్ వార్తల్లో నిలిచింది. టీమిండియా స్టార్ బౌలర్ షమీతో పెళ్లికి తాను రెడీ అంటూ పోస్టులు పెట్టింది. అయితే పెళ్లి చేసుకోవడానికి కొన్ని షరతులు వర్తిస్తాయంది. ఇంగ్లీష్ మాట్లాడడంలో మెరుగైతే శమీకి లైఫ్ పార్టనర్ గా మిగిలిపోతానంది. సెమీస్ లో అద్భుత ప్రదర్శన చేయడానికి తాను ఎలాంటి సహాయమైనా చేస్తానంది. వరల్డ్ కప్ లో సెమీస్ కి ముందు షమీ గురించి మాట్లాడింది. శమీ ఆటకు సినీ బ్యూటీ బౌల్డ్ అయిందంటూ…. వరల్డ్ కప్ సమయంలో ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. ప్రత్యర్థుల వికెట్లు తీయడమే కాదు పాయల్ ఘోష్ ను ఫిదా చేశాడంటూ షమీ అభిమానులు ఫన్నీ ఎమోజీలు షేర్ చేశారు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading