గరికపాటి నరసింహారావు…తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. రీసెంట్ గా గరికపాటి తన ప్రసంగాలకు గానూ పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. ఆధ్యాత్మిక అంశాలను భోదించే గరికపాటి సంధర్బాన్ని బట్టి సామాజిక రాజకీయ మరియు సినిమా అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ALSO READ : KOMURAMBHEEMUDO SONG : వార్నీ… కొమురంభీముడో పాటను అక్కడ నుండి కాపీ చేశారా..?
Advertisement
ఒక స్మగ్లర్ ను హీరోగా ఎలా చూపిస్తారు….ఇంకా తగ్గేదే లే అనే డైలాగులు కొట్టడం కూడా అవసరమా అంటూ గరికపాటి ఫైర్ అయ్యారు. ఇక తాజాగా గరికపాటి నరసింహారావు రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై స్పందించారు. తను కుంటుంబంతో కలిసి సినిమాలకు వెళతానని గరికపాటి అన్నారు. సినిమాలకు వెళ్లడం తప్పు కాదని నెలకు రెండు సినిమాలకు చూస్తానని అన్నారు.
Advertisement
తన భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు వెళతానని చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెబుతూ గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన గరికపాటి….అభిమానుల ఆశల మేరకు కళాకారులు బ్రతకాలా అంటూ ప్రశ్నించారు.
అభిమానుల కారణంగానే ఎన్టీఆర్ దగ్గర నుండి సచిన్ టెండూల్కర్ వరకూ అవస్తలు పడుతున్నారని చెప్పారు. వారి అంచనాల మేరకే నటించాలని అనుకుంటారు. నటుడు గుమాస్తా వేషం వేయకూడదా అంటూ ఫైర్ అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్…ఎస్వీ రంగారావు లను గమనిస్తే కారు డ్రైవర్ నుండి కర్మాగారం అధినేత వరకూ అన్ని పాత్రలు చేశారు. దర్శకుడి మాట విని హీరోలు నడుచుకోవాలి అంతే…నటులు ఇలాంటి పాత్రలే చేయాలని ఒత్తిడి చేయకూడదు అంటూ గరికపాటి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పాత్రే గొప్పగా ఉందని అన్నారు.