Ad
భారత జట్టుకు కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించిన సౌరవ్ గంగూలీ 2019 లో బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అయితే అప్పటి లెక్కల ప్రకారం గంగూలీ కేవలం ఆరు నెలలు మాత్రమే ఆ పదవిలో ఉండే వీలు ఉంటుంది. ఎందుకంటే బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి కూడా రాష్ట్ర క్రికెట్ బోర్డు లేదా బీసీసీఐలో రెండు సార్ల కంటే ఎక్కువగా వరుసగా పని చేయకూడదు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ అని అంటారు.
కానీ గంగూలీ వచ్చిన తర్వాత ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ను తొలగించాలని అనే వాదనను తెచ్చి సుప్రీం కోర్టులు పిటిషన్ కూడా వేసాడు. అయితే ఆ పిటిషన్ వేసిన కొన్ని రోజులకే కరోనా రావడంతో అది అలాగే ఉండిపోయింది. అయితే ఈ మాదే మళ్ళీ బీసీసీఐ తరపున వచ్చిన ఈ పిటిషన్ తెరపైకి వచ్చింది. ఇక ఈరోజు ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
అయితే సుప్రీం కోర్టు బీసీసీఐలో ఉన్న ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ నియమని మారుస్తూ తీర్పు అనేది వెలువరించింది. దాంతో గంగూలీ అలాగే సెక్రెటరీ జై షా ఇద్దరు తమ పదవులలో కొనసాగవచ్చు. అయితే బీసీసీఐలో నాలుగేళ్లకు ఒక్కసారి ఎన్నికలు అనేవి ఉంటాయి. కాబట్టి వచ్చే ఏడాది మళ్ళీ ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక అనేది ఉంటుంది. ఇక గంగూలీ అందులో పోటీ చేస్తాడు అనే విషయంలో ఏ అనుమానము లేదు.
ఇవి కూడా చదవండి :
మొదటికొచ్చిన పంత్, ఊర్వశీ వ్యవహారం..!
జయవర్ధనే, జహీర్ఖాన్లకు కొత్త పదవులు ఇచ్చిన ముంబై..!
Advertisement