Home » గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గంగోత్రి హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గంగోత్రి హీరోయిన్… ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు ఇండస్ట్రీలోకి రావడం సహజమే. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది మధ్యలోనే సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. ఆ లిస్టులో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ కూడా ఉంటారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా ద్వారా అదితి అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Also Read: ఆ హీరో రెచ్చగొట్టడం వల్లే.. నాగచైతన్య సమంత తో విడాకులు తీసుకున్నాడా..?

Advertisement

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతోపాటు అదితి అగర్వాల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయినప్పటికీ అదితి అగర్వాల్ ఆర్తి అగర్వాల్ రేంజ్ లో ఇండస్ట్రీలో రాణించలేకపోయింది. అతి తక్కువ సినిమాలే చేసి సినిమాలకు దూరమయింది.

Also Read:  ఈ రాశులకు చెందిన మహిళలు చాలా ధైర్యవంతులు.. వీళ్ళతో ఎవరైనా పెట్టుకుంటే ఖతమే..!!

Advertisement

గంగోత్రి తర్వాత ఈ అమ్మడు ఏం బాబు లడ్డు కావాలా, విద్యార్థి, కొడుకు సినిమాలలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో మళ్ళి సినిమాలు చేయలేదు. ఇక 2016 లో చివరిసారిగా లవ్ హాయ్ యార్ అక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఫ్యామిలీతో పాటు అదితి అగర్వాల్ విదేశాల్లో స్థిరపడింది. ఇప్పటికీ అదితి అగర్వాల్ సినిమాలకు దూరమైనా వివాహం చేసుకోలేదు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం అదితి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సోదరి ఆర్తి అగర్వాల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కాలాన్ని వెల్లదీస్తోంది. ఇక అదితి అగర్వాల్ ఫ్యూచర్ లో కూడా మళ్లీ ఇండస్ట్రీ లోకి వచ్చే ఆలోచనలో లేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అదితి ఫోటోలు వైరల్ అవుతుండటంతో గంగోత్రి హీరోయిన్ ఇంతలా మారిపోయిందని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also Read:  July 26th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading