Home » ముస్లిం యువతిని ప్రేమించిన గాంధీ కొడుకు.. బాపూజీ ఏం చేసారో తెలుసా..?

ముస్లిం యువతిని ప్రేమించిన గాంధీ కొడుకు.. బాపూజీ ఏం చేసారో తెలుసా..?

by Sravya
Published: Last Updated on
Ad

మహాత్మా గాంధీ కొడుకు మణి లాల్ ఒక ముస్లిం యువతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయం అందరికీ తెలియదు అయితే ఈ ప్రేమ వివాహానికి గాంధీజీ ఒప్పుకున్నారా..? తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం.. మహాత్మా గాంధీ కి నలుగురు కొడుకులు. వాళ్లలో ఒకరు మణి లాల్. చిన్న వయసులోనే ఒక ముస్లిం యువతి తో ప్రేమలో పడ్డారు. ఎలా అయినా ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ గాంధీజీ వ్యతిరేకించారు. సౌత్ ఆఫ్రికాలో గాంధీజీకి అత్యంత నమ్మకస్తుడైన సహచరుడు కూతురు ఫాతిమాని గాంధీ కొడుకు మణి లాల్ ప్రేమించారు, చిన్నప్పటినుండి కూడా వీళ్లు కలిసే పెరిగారు అన్ని మతాలు సమానమని తన తండ్రి చెప్పడంతో హిందూ ముస్లిం అనే భేదభావం వారిలో ఉండేది కాదట.

gandhi-son

Advertisement

Advertisement

మణిలాల్ తన పెళ్లికి ఒప్పుకుంటారని అనుకున్నారు కానీ ఈ క్రమంగా వాళ్ళ వివాహానికి అడ్డంకులు పెరిగాయి. మతాంతర వివాహానికి గాంధీజీ భార్య కస్తూరిబా పూర్తి వ్యతిరేకం. కోడలు వేరే మతానికి చెందిన వ్యక్తి అని తెలిస్తే అసలు జీర్ణించుకోలేరు. మణిలాల్ తన సోదరుడు రాందాస్ ద్వారా తండ్రికి ఒక వర్తమానాన్ని 1926లో గాంధీజీ ఇండియాలో ఉన్నప్పుడు పంపారు. ఫాతిమా ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు కానీ గాంధీజీ దగ్గర నుండి ఊహించని లేఖ వచ్చింది. నువ్వు హిందువు ఫాతిమా ముస్లిం. పెళ్లి తర్వాత ఆమె ముస్లిం గా ఉంటుంది ఒకే దగ్గర రెండు కత్తులు ఉండలేవు మీకు పిల్లలు పుడితే ఏ మతం ని అనుసరిస్తారు. పెళ్లి కోసం ఆమె మతాన్ని మార్చడం ధర్మం కాదు బట్టలు మార్చినంత ఈజీగా మతాన్ని మార్చుకోలేం అని గాంధీజీ అన్నారు.

తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోలేకపోయారు ఇలా తండ్రి మాటని కాదనలేక ఫాతిమా ని పెళ్లి చేసుకోలేదు ప్రారంభంలో గాంధీజీ మతాంతర కులాంతర వ్యవహాలని తీవ్రంగా వ్యతిరేకించారు. 1930 తర్వాత ఈ విషయంలో మనసుని మార్చుకున్నారు మణిలాల్ ఫాతిమని పెళ్లి చేసుకోలేకపోయారు కానీ ఒక దశాబ్దం తర్వాత ఆయన అన్నయ్య హరిలాల్ ముస్లిం మతాన్ని స్వీకరించారు ఆ తర్వాత నెల రోజులకి హిందూ మతంలోకి వచ్చారు మహాత్మా గాంధీ తర్వాత ఈ కుటుంబంలో ఐదవ తరం వచ్చింది వాళ్లలో కొంతమంది ఇతర మతాల వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎవరూ ముస్లింలను మాత్రం పెళ్లి చేసుకోలేదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading