Home » క‌రెన్సీ నోట్ల‌పై ఉండే గాంధీజీ బొమ్మ ఎక్క‌డ దొరికిందో తెలుసా..?

క‌రెన్సీ నోట్ల‌పై ఉండే గాంధీజీ బొమ్మ ఎక్క‌డ దొరికిందో తెలుసా..?

by AJAY
Ad

రైలు బండి నడవాలంటే పచ్చజెండా…. బతుకు బండి నడవాలంటే పచ్చనోటు కచ్చితంగా ఉండాల్సిందే. ఇది ఒక సినిమా లిరిక్స్ అయినప్పటికీ ఇదే జీవిత సత్యం కూడా.. ఎంత చేసినా ఏం చేసినా డబ్బు లేనిదే జీవితం ముందుకు వెళ్ళదు. నోటు లేనిదే పూట గ‌డవడు. అయితే కరెన్సీ నోట్లపై రకరకాల బొమ్మలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అలా మ‌హాత్మాగాంధీ ఫోటోతో నోట్లు ముద్రించ‌డాన్ని మహాత్మాగాంధీ శ్రేణి అంటారు.

Advertisement

money

money

అయితే మ‌హాత్మాగాంధీ ఫోటో ఎక్క‌డ నుండి వ‌చ్చింది అన్న‌ది చాలా మందికి తెలియదు. ఆ ఫోటో ఎక్కడ నుండి వచ్చింది…ఎలా వ‌చ్చింది అన్న‌ది ఇప్పుడు చూద్దాం…. అసలు క‌ల్మ‌షం లేకుండా న‌వ్వుతున్న గాంధీ ఫోటోను 1946వ సంవత్సరంలో గుర్తుతెలియని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. కోల్కతాలోని వైస్రాయ్ భవన్ లో బ్రిటిష్ సెక్రెటరీ లారెన్స్ అనే వ్యక్తిని 1946వ సంవత్సరంలో మహాత్మా గాంధీ కలవడానికి వెళ్ళాడు.

Advertisement

ఆ సమయంలోనే ఈ ఫోటోను తీశారట. ఇక ఆ ఫోటోను వైస్రాయ్ భవనం నుండి మనవాళ్లు తీసుకున్నారు. ఆ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడానికి అనుకూలంగా చేసుకుని ముద్రించడం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఫోటోకు మిర్రర్ ఇమేజ్ ను మొదటిసారిగా 1987లో ఐదు వందల నోటు పై ముద్రించారు. గాంధీజీ సిరీస్ నోట్లు 1996వ సంవత్సరం నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పటికీ కూడా గాంధీజీ చిత్రంతోనే నోట్లు వస్తూ ఉన్నాయి.

Visitors Are Also Reading