టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ లోని రూర్కి ప్రాంతంలో రిషబ్ కారు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. అయితే, కారు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.
పంత్ చికిత్సకు అయ్యే వ్యయం మొత్తాన్ని తామే భరిస్తామని ఇదివరకే ప్రకటించిన బోర్డు, అతడికి వార్షిక వేతనం మొత్తం రూ. 5 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.ఐపీఎల్ వేతనం రూ. 16 కోట్లు సైతం తామే చెల్లిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇటీవలే మోకాలి లిగ్మెంట్ సర్జరీ చేయించుకున్న పంత్ మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరం కానున్న సంగతి తెలిసిందే. దీంతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ కు సైతం అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
రిషబ్ పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉండటంతో అతడికి రూ. 5 కోట్ల వార్షిక వేతనాన్ని చెల్లించనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి పంత్ దూరం అయినా సరే అతడికి ఫుల్ శాలరీ లభించనుంది. పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ చెల్లించాల్సిన రూ. 16 కోట్ల వేతనాన్ని బోర్డు చెల్లించనుంది. వికెట్ కీపర్ కోసం బీసీసీ రూ. 21 కోట్ల వేతనాన్ని చెల్లిస్తున్నప్పటికీ, బీసీసీఐ తన ఖాతా నుంచి ఒక్క రూపాయి కూడా తీయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ బీమా చేయించడమే దీనికి కారణం.