పదేళ్ల కిందట కొత్తగూడెం గల్లిలో తిరిగిన కుర్రాడు.. ఓ రోజు హైదరాబాద్ బస్సు ఎక్కాడు.. ఇప్పుడు..? అంతర్జాతీయ మోడళ్లతో భుజం భుజం రాసుకొని తిరిగే ఫ్యాషనిస్ట్.. సినిమా తారలు మెచ్చే దుస్తుల డిజైనర్.. తనే వాసం శెట్టి గోవిందరాజు. వచ్చే జనవరిలో కెనడాలో జరిగే ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షోకి ఆహ్వానం అందుకున్నాడు. ఈ మధ్యలో ఏమి జరిగింది. ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు.. ప్రయాణాన్ని మనంతో పంచుకున్నాడు.
గత నెలలో జరిగిన ఇండియా రన్ వే ఫ్యాషన్ షోలో దేశంలో అగ్ర మోడళ్లతో కలిసి ఓ యువ డిజైనర్ క్యాట్‌వాక్ చేస్తున్నాడు. అతని డిజైన్స్ చూసి అక్కడికొచ్చిన ఫ్యాషన్ పండితులందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా గోవిందరాజు చిన్నప్పటి నుంచే బొమ్మలు బాగా వేసేవాడు. సినిమాలు, ఫ్యాషన్లంటే పిచ్చి. ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రయత్నించు రాజస్థాన్‌కు ఓ వ్యక్తి సలహా ఇచ్చారట. వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాడు.
అతను ఇక్కడికి వచ్చాక తెలిసింది అవకాశాలు ఊరికే రావని.. పరిచయం ఉన్న వారి చుట్టూ తిరిగాడు. సృజనాత్మకంగా డ్రెస్ డిజైన్ చేసి చూపించే వారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింద. తనను తాను అప్‌డేట్ చేసుకోవడానికి 2008లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తిరిగి వచ్చాడు. బుల్లితెర నటులు, యాంకర్లకు డ్రెస్ డిజైన్ అవకాశం వచ్చింది. అలా సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. దర్శకుడు మారుతి ప్రోత్సాహంతో బస్టాప్ సినిమా హీరో హీరోయిన్లకు దుస్తులు రూపొందించాడు.
ఆ తరువాత వెనుదిరిగే అవకాశమే లేకుండా పోయింది. దాదాపు 25 చిత్రాలకు కార్టూన్ డిజైనర్‌గా పని చేసాడు. 2015ఓ ఢిల్లీలో జరిగిన ఇండియా రన్ వే వీక్ నెక్స్ట్స్ జనరేషన్ కేటగిరి విభాగంలో సత్తా చాటాడు. ఈ పోటీకి దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైంది అతనొక్కడే కావడం గమనార్హం. గోవిందరాజుకు వచ్చే జనవరిలో కెనడాలో నిర్వహించే ప్రతిష్టాత్మక వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌కు ఆహ్వానం అందింది. వీటితో పాటు దేశంలోని టాప్ షో.. అంతర్జాతీయంగా మిలన్, ఫ్యారీస్ ఫ్యాషన్ షోలకు డిజైన్ చేయడమే లక్ష్యం అంటున్నారు గోవిందరాజు.