చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువ వరకు చాలామంది అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. చలి విపరీతంగా ఉండడం వల్ల చాలామంది జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చలికాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎన్నో రకాల మందులు వేసుకున్నప్పటికీ అంత త్వరగా నయం కాదు. మందులు వాడినా కూడా ప్రతి ఒక్కరూ చలికాలంలో తిండి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చు. బయట ఫుడ్ అసలు చలికాలంలో తినకూడదు. ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అయితే చలికాలంలో ఎలాంటి ఆహారం తినకూడదో ఇప్పుడు చూద్దాం.
Advertisement
# వేయించిన ఆహారం
చలికాలంలో ఫ్రైడ్ ఫుడ్ అసలు తీసుకోకూడదు. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి అనారోగ్య సమస్యలు తయారవుతాయి. వేయించిన ఆహారంలో కొవ్వు అధిక శాతంలో ఉంటుంది. చలికాలంలో వేయించిన ఆహారాన్ని తినడానికి చాలామంది ఆసక్తిని చూపుతూ ఉంటారు. కానీ వేయించిన ఆహారం తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు తెలపడం జరిగింది.
# ప్రిజర్వ్డ్ ఫుడ్
చలికాలంలో ఎక్కువగా ప్రిజర్వ్డ్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన చల్లని ఆహార పదార్థాలను అసలు తినకూడదు. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.
# పచ్చి కూరగాయలు
చాలామందికి పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉంటుంది. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నప్పటికీ చలికాలంలో వీటిని తినడం వల్ల అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలో బ్యాక్టీరియాను పెంచుతాయి. అందువల్ల చలికాలంలో పచ్చి కూరగాయలకు కాస్త దూరంగా పెట్టడం మంచిది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.