కరోనా విజృంభణ సమయంలో రేషన్ కార్డుదారులకు ఫ్రీ రేషన్ ను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఇస్తున్న నాలుగు కిలోల బియ్యంతో కలిపి రెండు కిలోల బియ్యాన్ని ఇస్తున్నారు. అయితే ఈ పథకం గడువు ఈనెలాఖరు వరకు ముగియనుంది. కాగా నేడు ప్రధాని మోడీ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ ఫ్రీ రేషన్ ను మరో ఆరు నెలల వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Advertisement
Advertisement
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈయేడాది సెప్టెంబర్ వరకూ ఉచిత రేషన్ పంపిణీ జరగనుంది. ఇక ఈ పథకం ద్వారా దేశంలో మొత్తం 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఇదిలా ఉండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి యూపీలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యానాత్ మరో మూడు నెలలు తమ రాష్ట్రంలో ఫ్రీ రేషన్ ఇస్తామని ప్రకటించారు. ఇక ఇప్పడు కేంద్రం ఏకంగా ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో యోగి సర్కార్ కు కూడా భారం తగ్గనుంది.