Home » సాఫ్ట్వేర్ జాబ్స్ అంటూ మోసం… వామ్మో ఇంత దారుణమా..? అసలేం జరిగింది..?

సాఫ్ట్వేర్ జాబ్స్ అంటూ మోసం… వామ్మో ఇంత దారుణమా..? అసలేం జరిగింది..?

by Sravya
Ad

సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ఒక యువకుడు ఘరానా మోసానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా సాఫ్ట్వేర్ కోచింగ్ పేరుతో సెంటర్ ని స్టార్ట్ చేశాడు ఏకంగా సంవత్సరం నుండి కూడా డబ్బులు ని దండుకుంటున్నాడు. తప్పుడు ఉద్యోగ అనుభవ ధ్రువపత్రాలని సృష్టిస్తూ వాటి ఆధారంగా ఉద్యోగాలని ఇప్పిస్తున్నాడు. ఏకంగా లక్షలాది రూపాయలు దండుకుంటున్నాడు. అయితే ఇలా తప్పుడు దృవపత్రాలతో ఉద్యోగాలు రెండు మూడు నెలలకే పోతున్నాయి. ఈ యువకుడు గత ఏడాదిన్నర క్రితం వైరా లో సాఫ్ట్వేర్ కోచింగ్ అంటూ అందర్నీ మోసం చేస్తున్నాడు.

Advertisement

Advertisement

అతను నడిపే ఇంటికి కానీ ఆఫీసుకు కానీ ఎలాంటి బోర్డ్ కూడా పెట్టుకోలేదు కేవలం సోషల్ మీడియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకుంటున్నాడు. పలు సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో ఫర్జారీ ఉద్యోగ అనుభవ ధ్రువ పత్రాలను కూడా తయారు చేస్తూ వాటి ఆధారంగా ఉద్యోగాలని ఇప్పిస్తున్నాడు. అనేక అక్రమాలతో ఉద్యోగాలు ఇప్పిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు అంతేకాకుండా అక్కడికి వచ్చిన మహిళను ప్రేమ పేరుతో వేధించి 15 లక్షలు నగదు కాజేస్తున్నట్లు కూడా పోలీసులకి ఫిర్యాదు చేసింది మహిళ.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading