Home » రోజూ వీటిని పాటించండి.. మీ జీవిత కాలం పెరుగుతుంది…!

రోజూ వీటిని పాటించండి.. మీ జీవిత కాలం పెరుగుతుంది…!

by Sravya
Ad

జీవిత కాలమును పెంచే అలవాట్లు కొన్ని ఉన్నాయి, వాటిని కనుక మనం రెగ్యులర్ గా పాటించినట్లయితే జీవిత కాలాన్ని పెంచొచ్చు. నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. ఇలా తాగడం వలన బాడీ డిటాక్సిఫై అవుతుంది దాంతో అనారోగ్య సమస్యలు ఏమి కూడా ఉండవు. చాలామంది బరువు తగ్గడానికి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ని తినకుండా ఉంటారు. అలా చేయడం వలన ఉపయోగం అయితే లేదు పైగా బరువు పెరిగిపోతారు కూడా. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని ఖచ్చితంగా తీసుకోండి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లు తాగండి. ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల వరకు నీళ్లు తాగడం మంచిది. బాడీ డిటాక్సిఫై అయ్యి ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement

Advertisement

భోజనం చేస్తున్నప్పుడు దాని మీదే ధ్యాస పెట్టాలి మొబైల్ టీవీ వంటివి చూస్తూ తినడం మానుకోవాలి. భోజనం పై ధ్యాస పెట్టుకుని తినండి. జీర్ణ సంబంధిత సమస్యలు స్క్రీన్ లను చూస్తూ తినడం వలన కలుగుతాయి. రోజు కనీసం గంటసేపైనా మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయడం వలన వెన్నెముక బలంగా తయారవుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పొందొచ్చు. జీవిత కాలం ని కూడా పెంచొచ్చు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగండి ఇలా చేయడం వలన జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. ప్రతిరోజు భోజనం తిన్నాక కనీసం 30 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే మరీ మంచిది. రాత్రిపూట తొందరగా భోజనం చేసేయండి భోజనం తిన్నాక వాకింగ్ చేయండి. తగినంత నిద్ర కూడా చాలా అవసరం. వీటిని కనక మీరు అలవాటు చేసుకున్నట్లయితే జీవితకాలన్ని పెంచుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading