Home » శీతాకాలంలో చర్మం బాగుండాలంటే.. ఈ ఆహారపదార్దాలని తీసుకోండి..!

శీతాకాలంలో చర్మం బాగుండాలంటే.. ఈ ఆహారపదార్దాలని తీసుకోండి..!

by Sravya
Ad

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే అందంగా ఉండడం మన చేతుల్లో వుంది అనుకుంటే పొరపాటు. చలికాలంలో అందం పాడవుతుంది. చలి కాలంలో చర్మ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది కాంతిహీనంగా మారిపోతుంది. పొడిగాలును చలి వలన చర్మం తేమని కోల్పోతుంది. ఆకుకూరలు తీసుకుంటే చర్మం బాగుంటుంది. తోటకూర, పాలకూర, బచ్చలి కూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తోటకూర మొదలైన ఆకు కూరల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి. చలికాలంలో తీసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

Advertisement

Advertisement

అల్లం పసుపు పుదీనా కొత్తిమీర వంటి ఔషధ గుణాలు ఉండే వాటిని తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉంటుంది. లవంగాలతో కూడా చర్మం బాగుంటుంది. లవంగాలు లోని గుణాలు బాడీ ని వెచ్చగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలుని కూడా తగ్గించగలవు. దాల్చిన చెక్క ని కూరలోనే కాకుండా టీ కాఫీలులో కూడా వెయ్యచ్చు.

చలికాలంలో దాల్చిన తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మిరియాలను కూడా తీసుకుంటూ ఉండండి చర్మం బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఔషధ గుణాలతో ఉంటుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది డ్రై ఫ్రూట్స్, పండ్లు కూడా తీసుకుంటూ ఉండండి ఇవి కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి పైగా మీ అందం కూడా తగ్గదు అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు కూడా.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading