Home » ఆఫీస్ లో ఈ వాస్తు టిప్స్ పాటిస్తే వ్యాపారంలో మీకు తిరుగు ఉండదు…!

ఆఫీస్ లో ఈ వాస్తు టిప్స్ పాటిస్తే వ్యాపారంలో మీకు తిరుగు ఉండదు…!

by AJAY
Ad

భారతదేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మానవ జీవన విధానం పై వాస్తు శాస్త్రం ఎంతో ప్రభావితం చేస్తుందని మన పూర్వీకుల నుండి విశ్వసిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇల్లు నిర్మించే సమయంలో వాస్తు గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.

Advertisement

అయితే కేవలం ఇంట్లోనే కాకుండా వ్యాపారస్తులు తమ ఆఫీసులలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవ్వడం వల్ల అభివృద్ధి చెందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆఫీసులో కూచుకునే టేబుల్స్ ఎక్కడ ఉండాలి.. దానిపై ఏ వస్తువులు ఉండాలి. ఏ దిశలో టేబుల్ ఉండాలి అనేది కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. కాబట్టి ఆఫీసులో పాటించాల్సిన వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Vastu tips for office

Vastu tips for office

వాస్తు శాస్త్రం ప్రకారం గా ఆఫీసులో టేబుల్ గది తలుపు లేదా గది ద్వారానికి ఎదురుగా ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కూర్చున్న తర్వాత వీపు భాగం గోడ వైపు మాత్రమే ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. టేబుల్ పై ఉండే క్రిస్టల్ లు టేబుల్ కు ఈశాన్యం వైపున ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : ఆవాలతో నరదిష్టి మాయం…ఇలా చేస్తే సరిపోతుంది…!

అదేవిధంగా టేబుల్ పై ఫైల్స్, డాక్యుమెంట్స్, పుస్తకాలను కుడి చేతి వైపు ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ టేబుల్ పై క్యాలెండర్ ఉంటే అవి టేబుల్ కు ఉత్తర దిశగా ఉండాలని చెబుతున్నారు. అదేవిధంగా ఆఫీసులోని టేబుల్ వెనకాల ఏవైనా దేవుడి చిత్రపటాలు ఉంచుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఈ వాస్తు టిప్స్ పాటించడం వల్ల ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటంతో పాటు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading