ప్రతిరోజు తాజాగా కనిపించడానికి ఆరోగ్యంగా ఉండటానికి ఉదయాన్నే స్నానం చేస్తూ ఉంటాం. అయితే స్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా స్నానం చేస్తే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఈ ఐదు తప్పులు మాత్రం చేయకూడదని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొంతమంది బాత్రూంలోకి వెళ్లారంటే ఎక్కువ సేపు బాత్రూంలోనే గడుపుతారు. ఎండాకాలంలో అయితే చల్లగా ఉండేందుకు.. చలికాలంలో అయితే వెచ్చగా ఉండేందుకు వేడినీటిని పోసుకుంటూ ఆస్వాదిస్తారు. కానీ ఎక్కువ సేపు నీటిలో ఉండటం ఆరోగ్యానికి హానికరం అని, దాంతో చర్మం పొడిబారే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరస్తున్నారు. ఇప్పటికే ఒకవేళ మీరు పొడిబారే చర్మానికి కలిగి ఉంటే ఐదు నుండి పది నిమిషాల కంటే ఎక్కువ సేపు స్నానం చేయవద్దు.
Advertisement
కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తూ ఉంటారు. ఉదయం… మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా స్నానానికి వెళ్తుంటారు. అయితే ఉదయం మాత్రమే స్నానం చేయాలని స్లీప్ మెడిసిన్ రివ్యూస్. అధ్యయనం చెబుతోంది ఒకవేళ రెండు సార్లు స్నానం చేయాలి అనుకుంటే మాత్రం రాత్రి కూడా స్నానం చేయవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బాగా నిద్ర పడుతుంది.
Advertisement
ALSO READ : ఇంట్లో ఇలాంటి చీపుర్లను అస్సలు వాడకూడదు
చలికాలంలో వేడి నీళ్లు చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే మరీ ఎక్కువ వేడి ఉన్న నీటితో కూడా స్నానం చేయవద్దని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేడిగా ఉండే నీటిని స్నానం చేయడం వల్ల చర్మానికి రక్షణ గా ఉన్న నేచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయని చెబుతున్నారు. దాంతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని..చర్మం పొడిబారిపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
కొంతమంది సౌందర్యం కోసం మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ప్రొడక్ట్ లు అన్నీ వాడుతూ ఉంటారు. కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చూసుకోకుండా అన్నీ వాడేస్తుంటారు. అయితే అలా ఎక్కువ కెమికల్స్ ఉండే సబ్బులను షాంపూలను వాడటం కూడా చర్మానికి హాని కలిగిస్తుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. అలా తిన్న వెంటనే స్నానం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే స్నానం చేస్తే ఎసిడిటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కనీసం తిన్న తర్వాత ఒక గంట సమయం అయినా తీసుకుని ఆ తర్వాత స్నానం చేయాలని చెబుతున్నారు.